
సినిమా.. ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చెయ్యడానికి, ఆలోచన శక్తిని పెంచడానికి ఆవిర్భవించిన 'అవదూత'గా భావించవచ్చు. కానీ అన్ని సినిమాలు ప్రేక్షకులకి నచ్చి హిట్టవుతాయా అంటే లేదు. కొన్ని చిత్రాలైతే ప్లాప్ కంటే మరి దారుణంగా ఉంటాయి. అలాంటి చిత్రాలు అప్పుడప్పుడు వస్తాయా అనుకోవడానికి లేదు. నన్ను మర్చిపోకు అన్నాయ్ అంటూ ప్రతి వారం వస్తుంటాయి. అలాంటి చిత్రాల గురించి సోషల్ మీడియాలో సినీ ప్రేమికుల మధ్య ఫన్నీ కామెంట్స్ నడుస్తున్నాయి.
వాళ్లంతా పలు మీమ్స్ తో 'సాధారణంగా 100 శాతం సినిమాల్లో 70 శాతం చిత్రాలు ప్రమోషనల్ కట్స్ ద్వారానే తమ అసలు రంగుని బయటపెడతాయి. ఉదాహరణకు ట్రైలర్‌లో కనీసం 50 శాతం సరిగ్గా లేకపోయినా, ఏదో ఒక సాంగ్, లేదా టీజరో చూసి ఆశపడి 200 నుంచి 350 వరకు టికెట్ కొని థియేటర్లలో అడుగుపెడతాం. మొదటి 30 నిమిషాలకే సీటులో కూర్చోలేక నరకం చూస్తాం. 'ముందే ట్రైలర్‌లో క్లియర్‌గా చూపించారు కదా రా బాబు.. నీకు నువ్వే వెళ్లావ్, ఇప్పుడు నిర్మాతలని అంటే ఏం లాభం?" అంటూ నెటిజన్లు ఒకరిపై ఒకరు జాలి చూపిస్తూ కామెంట్లు చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది.

Also Read: ఈడి సోదాలు: నాగార్జున నిర్మాత ఇంట్లోనే ఎందుకు?
ఇంకొంత మంది అయితే ట్రైలర్ చూసినప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ తో కూడిన ఎక్స్‌ప్రెషన్, మూవీ చూసిన తర్వాత వచ్చే విరక్తిని పక్కపక్కన పెట్టి వందల కొద్దీ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. "ట్రైలర్‌లోనే ప్లాప్ సిగ్నల్స్ 80% కనిపించాయి, కానీ నేను మిగిలిన 20% పాజిటివిటీని నమ్మి థియేటర్‌కి వెళ్లి 500 పోగొట్టుకున్నా" అంటూ రాసుకొచ్చే రివ్యూలు నవ్వులు పూయిస్తున్నాయి.
[Telugu Cinema, Cinema, Trailer, EPic, varahi MahendraGiri, Sardar 2, Maandadi, Telugu Cinema News, TeluguNews, Tollywood, Tollywood News, TeluguCinema]





