
కింగ్ నాగార్జున నుంచి వచ్చిన భక్తి రస చిత్రాలు 'షిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ అభిమానులని, భక్తులని అలరించిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలని నిర్మించింది మహేష్ రెడ్డి. బ్యానర్ పేరు AMR . మహేష్ రెడ్డి ప్రముఖ పారిశ్రామిక వేత్త కూడా. AMR పేరుతో పాటు ఇతర పేర్లతో పలు రాష్ట్రాలలో పలు రకాల వ్యాపారాలు ఉన్నాయి.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కమలాపురి కాలనీలో ఉన్న ఏఎంఆర్ గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్ లోని నివాసం, సంస్థల డైరెక్టర్ల ఇళ్లపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో కోల్‌కతా, ఢిల్లీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ప్రత్యేకాధికారులతో కలిసి పాల్గొని, కీలక పత్రాలు, డిజిటల్ లాగ్‌బుక్స్ మరియు బ్యాంక్ లావాదేవీల రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. ఈ సోదాల వెనుక 60 కోట్లకు పైగా విలువైన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా గతంలో శ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ (SREI Infrastructure Finance Ltd) మరియు శ్రీ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ (SREI Equipment Finance Ltd) నుంచి పొందిన రుణాల కేటాయింపు, వాటి నిధుల మళ్లింపు (Diversion of Funds), రౌండ్ ట్రిప్పింగ్ మరియు నిధుల ఎవర్ గ్రీనింగ్ వంటి ఆరోపణలపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈ విచారణ ముమ్మరంగా సాగుతోంది.

Also Read: కాకా నుంచి చిరు లీక్స్: ఆ పని చేసింది థమన్ అని నమ్మచ్చా!
కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోని దాదాపు 12 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించడం వ్యాపార, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఏఎంఆర్ మైనింగ్ సంస్థ మరియు దాని ప్రమోటర్ మహేష్ రెడ్డిపై కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా పెరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2022లో కూడా జమ్మూ కాశ్మీర్ కేసుకి సంబంధించి 60 కోట్ల అనుమానాస్పద డిపాజిట్ల అంశంలో ఈడీ ఈ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేసింది. అలాగే గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ ప్రాంతంలో 3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సంఘటనతో కూడా ఈ గ్రూప్‌కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఆదాయపన్ను శాఖ (I-T) మరియు ఎన్నికల సంఘం అధికారులు కూడా విచారణ జరిపారు. ఆ సమయంలో ఏఎంఆర్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లోనూ, కాన్ఫిడెన్షియల్ అకౌంట్స్ బుక్స్, ఫైళ్లపై తనిఖీలు జరిగాయి.
Also Read: కాకా నుంచి చిరు లీక్స్... ఆ పని చేసింది థమన్ అని నమ్మచ్చా!

మైనింగ్ డెవలప్‌మెంట్, కాంట్రాక్ట్ మైనింగ్, సాగునీటి ప్రాజెక్టులు (Irrigation Projects), రహదారుల నిర్మాణం మరియు పారిశ్రామిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో బిలియన్ల కొద్దీ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ పట్ల ఈడీ ఆరోపణలు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మహేష్ రెడ్డి ఏఏస్కాట్ బిల్డర్స్, ఏఎంఆర్ ఎనర్జీ, ఏఎంఆర్ వేర్‌హౌసింగ్, వాలిడో ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి అనేక అనుబంధ సంస్థలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికలకు ముందు మరియు ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ మళ్లింపుల్లో వందల కోట్ల రూపాయలు అక్రమంగా చేతులు మారాయనే కోణంలో ఈడీ అధికారులు డిజిటల్ డేటా ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక నేరాల నియంత్రణలో భాగంగా ఈడీ చేపట్టిన ఈ విస్తృత తనిఖీలు మున్ముందు ఏ మలుపు తిరుగుతాయోనని పరిశ్రమల ప్రతినిధులు ఉత్కంఠగా గమనిస్తున్నారు.
[A Mahesh Reddy, Nagarjuna, Shridi Sai, Ed Rides, Om NamoVenkatesaya, Telugu Cinema News, TeluguNews, Tollywood, Tollywood News, TeluguCinema]




