
సినిమా.. అంటే పెన్నుతో పేపర్ పై రాసుకున్న కథని కెమెరాతో తెరపై చెప్పడం. ఇందుకు దర్శకుడితో పాటు అతని టీం పని చేస్తుంది. ఈ వర్డ్ చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ దర్శకుడికి అతని టీంకి సృజనాత్మకత ఉందా లేదా అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. కానీ విజయం వస్తే మాత్రం మిగతా విషయాల జోలికి వెళ్లకుండా ఆనందాన్ని అందరు పంచుకుంటారు.
కానీ బాక్సాఫీస్ వద్ద సినిమా బోల్తా కొడితే ఆ ప్రభావం ప్రొడక్షన్ హౌస్‌లపై తీవ్రంగా పడుతుంది. ఇటీవల టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్‌లో ఒక షాకింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది.భారీ అంచనాలతో 70 కోట్ల నుండి 100 కోట్లకి పైగా వ్యయంతో తెరకెక్కిన ఒక భారీ చిత్రం థియేటర్లలో తీవ్రంగా నిరాశపరిచింది. అయితే అసలు వివాదం సినిమా డిజాస్టర్ అవ్వడంతోనే ఆగలేదు. ఆ సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో అయిన తిండి, విలాసవంతమైన హోటల్ స్టేలు, లగ్జరీ ట్రావెల్ బిల్లుల దాకా ప్రొడ్యూసర్, డైరెక్టర్ టీమ్ మధ్య రచ్చకెక్కాయని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా ఘోరంగా ఫ్లాప్ అవ్వడంతో వంద కోట్లకు పైగా నష్టపోయిన సదరు నిర్మాత, షూటింగ్ సమయంలో డైరెక్టర్, అతని టీమ్ ని పిలిచి చెప్పరాని భాషలో మాట్లాడి ఫుడ్ బిల్ కి రెండు కోట్లు ఏంటి? డబ్బులు కట్టమని గొడవ చేసాడంట.
ఇది కూడా చదవండి: 'జైలర్ 2' స్పెషల్ సాంగ్ ఆఫర్ పట్టింది ఈ బాలీవుడ్ బ్యూటీనే! హార్ట్స్ జాగ్రత్త!
సాధారణంగా ఒక పెద్ద హీరో లేదా స్టార్ డైరెక్టర్ సినిమా మొదలైతే ప్రొడక్షన్ వ్యయంలో సుమారు 15% నుండి 20% వరకు కేవలం నటీనటులు, సాంకేతిక నిపుణుల వ్యక్తిగత సిబ్బంది, ఫుడ్ అండ్ అకామడేషన్ ఖర్చులకే సరిపోతుంది. రోజుకు లక్షల రూపాయల చొప్పున బిర్యానీలు, స్టార్ హోటల్ ఫుడ్ ఆర్డర్లు, ప్రత్యేక కాంప్లిమెంటరీ అలవెన్సులు ఇవ్వడం టాలీవుడ్‌లో ఆనవాయితీగా మారింది. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద 80% పైగా డిస్ట్రిబ్యూషన్ నష్టాలను చవిచూడటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ నిర్మాత, స్టార్ డైరెక్టర్‌ను నేరుగా ప్రశ్నించినట్లు ప్రచారం సాగుతోంది. "రెమ్యూనరేషన్ల రూపంలో కోట్లు తీసుకున్నారు, సినిమాను సరిగ్గా తీయకపోగా ఈ అనవసర ఫుడ్ బిల్లులు, లగ్జరీ ఖర్చులు కూడా నేనే భరించాలా? అని డైరెక్టర్ ముందే తెగేసి చెప్పినట్లు టాక్.
[Telugu Cinema Flop Producer And Director Food Bill Controversy, tollywood producer director clash, cinema flop food bill controversy, telugu movie budget issues, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]





