Home

»

Latest News

'జైలర్ 2' స్పెషల్ సాంగ్ ఆఫర్ పట్టింది ఈ బాలీవుడ్ బ్యూటీనే! హార్ట్స్ జాగ్రత్త!

Sep 30, 2026 1:01PM

 

 అక్టోబర్ 15 నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ వన్ మాన్ షో 'జైలర్ 2 నామ నెలగా మారనుంది.  దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ మొదటి భాగాన్ని మించి అత్యద్భుతంగా తెరకెక్కించాడనే టాక్ వినిపిస్తుంది. ఇక ఫస్ట్ పార్ట్ లో  మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన  'కావాలయ్యా' స్పెషల్ సాంగ్ సృష్టించిన సంచలన విషయం తెలిసిందే. జైలర్ హిట్ రేంజ్ శక్తిని కూడా పెంచిన రికార్డు కూడా.   


 ఈ క్రమంలోనే ఇప్పుడు పార్ట్ 2 లో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ డ్యాన్స్ క్వీన్ నోరా ఫతేహీగ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన మాస్ డ్యాన్స్ మూవ్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించే నోరా ఫతేహీ, రజినీకాంత్‌తో కలిసి ఒక పవర్‌ఫుల్ అండ్ హై ఎనర్జీ స్పెషల్ డ్యాన్స్ నెంబర్‌లో స్టెప్పులేయనుంది. ఇదివరకు 'దిల్‌బర్', 'సాకి సాకి', 'మాణికే' వంటి సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్‌తో సంచలనం సృష్టించిన నోరా, సూపర్ స్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి కావడంతో ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


ఇది కూడా చదవండి: పాట వినండి.. ఉద్యోగం పొందండి..కొంతమందికి ఆఫర్స్ లెటర్ కూడా ఇచ్చారు!

 

చెన్నైలోని ఓ వేసిన భారీ సెట్‌లో ఏకంగా 8 రోజుల పాటు ఈ హై-వోల్టేజ్ డ్యాన్స్ నంబర్ షూటింగ్ సాగింది.   సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ మాస్ ట్రాక్‌కు అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేసారని టాక్.  తాజాగా ఈ సాంగ్ రిలీజ్ టైమ్ కూడా లాక్ అయిందనే వార్తలు బయటకు రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఈ రోజు సాయంత్రం 6 గంటల సమయానికి ఈ స్పెషల్ సింగిల్‌ను గ్రాండ్‌గా విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సాయంత్రం ఆరు నుంచి ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు.

 

 

[Jailer 2 Nora Fatehi Special Song Update, Jailer 2, Rajinikanth Jailer 2, Nora Fatehi Special Song, Jailer 2 Song Release Time, Anirudh Ravichander, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com