
తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా అడుగుపెట్టి, కమెడియన్‌గా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి హీరో స్థాయికి ఎదిగాడు సూరి. ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో చెప్పిన మాటలు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సూరి మాట్లాడుతూ 'ఒక పెద్ద హీరో చిత్రంలో నటించేందుకు అవకాశం లభించింది. అప్పటికే పరిశ్రమలో తిరుగులేని స్థానంలో ఉన్న ఒక స్టార్ కమెడియన్‌తో కలిసి నటించే కీలకమైన కాంబినేషన్. ఎంతో ఉత్సాహంతో, నటిస్తూ సీన్‌ని విజయవంతంగా పూర్తి చేశాను. కానీ సన్నివేశంపూర్తయిన వెంటనే హీరో, దర్శకుడు కలిసి మానిటర్‌లో అవుట్‌పుట్ పరిశీలించారు. ఆ తర్వాత కారణం చెప్పకుండా నేను ధరించిన చొక్కాని విప్పేయమని ఆదేశించారు. బలవంతంగా నా ఒంటిపై నుంచి విప్పించిన ఆ చొక్కాని రికమండేషన్ ద్వారా షూటింగ్‌కి వచ్చిన మరో వ్యక్తికి తొడిగారు. చిత్రమైన విషయం ఏంటంటే ఆ రోజు ధరించింది సినిమా కాస్ట్యూమ్ విభాగానికి చెందినది కాదు. నా సొంత డబ్బులతో కొనుక్కున్న వ్యక్తిగత దుస్తులు. కనీసం నా సొంత చొక్కా అనే విషయాన్ని కూడా లెక్క చేయకుండా లాక్కొని కాస్ట్యూమ్స్ వాహనం పైకి విసిరేశారు. షూటింగ్ ప్రాంతంలో అందరి ముందూ ఒంటిపై కేవలం ఒక చిన్న టవల్ మాత్రమే చుట్టుకుని, తీవ్రమైన మానసిక వేదనతో, అవమాన భారంతో నా చొక్కా కోసం పడిన తపన వర్ణనాతీతం అని భావోద్వేగంతో చెప్పకొచ్చాడు.
Also read: ట్విస్ట్ ఇచ్చిన మాధురి రాథోడ్: పరారీలో ఆ ప్రముఖుడు
ఇటీవల 'మామన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి,న సూరి త్వరలోనే సెప్టెంబర్ 10న 'మండాడి' చిత్రంతో అలరించేందుకు సిద్దమవుతున్నాడు.
[ Soori, Shirt, Mandaadi, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]





