Home

»

Latest News

ట్విస్ట్ ఇచ్చిన మాధురి రాథోడ్: పరారీలో ఆ ప్రముఖుడు

Sep 1, 2026 5:06PM

 

తెలంగాణ జానపద కళారంగంలో ఎంతో ప్రజాదరణ పొందిన జానపద నటులు, డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల వ్యవహారం ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన వేములవాడ హోటల్ రూమ్ ఘటన తర్వాత, ఈ వివాదం కాస్తా క్రిమినల్ కేసు వైపు వెళ్ళింది. 

హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో  మాధురి రాథోడ్ తన ఫిర్యాదులో 'ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నాతో  శారీరక సంబంధం పెట్టుకుని తీవ్రంగా మోసం చేసాడు.  కేవలం మోసం చేయడమే కాకుండా, నా పరువుకి భంగం కలిగించేలా ప్రవర్తించాడు. నా  వ్యక్తిగత ఫోన్‌లో ఉన్న దృశ్యాలు, వీడియోలని  ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ద్వారా మార్ఫింగ్ వీడియోలని  సృష్టించాడు. నాకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నట్లు చిత్రీకరిస్తూ ఆ  ఏఐ మార్ఫింగ్ వీడియోలని  సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి తీవ్ర మనోవేదనకి  గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొంది.


Also read: టాక్సిక్ కి షాకింగ్ రేటింగ్ ఇచ్చిన మహేష్ కుమారుడు గౌతమ్ 

 

దీంతో  ఫిర్యాదులోని అంశాలని  పరిశీలించిన పోలీసులు, ఈశ్వర్ సాయిపై నూతన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద  కేసు నమోదు చేశారు. మోసపూరిత వాగ్దానాలు, పెళ్లి చేసుకుంటాననే నెపంతో శారీరక సంబంధం పెట్టుకోవడం వంటి నేరాల కింద ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇది నాన్-బెయిలబుల్ అఫెన్స్ కావడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఈశ్వర్ సాయి ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు నార్సింగి పోలీసులు రెండు   ప్రత్యేక పోలీసు బృందాలని రంగంలోకి దించి జల్లెడ పడుతున్నారు. ఆగస్టు నెలలో వేములవాడలోని ఒక లాడ్జి లేదా హోటల్ గదిలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌లు కలిసి ఉన్న సమయంలో, ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి చేరుకోవడంతోవివాదం మొదలైన విషయం తెలిసిందే.

 

[ Madhuri Rathod, Eshwar Sai, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com