.webp)
ప్రపంచ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు 'సిడ్నీస్వీనీ.. 'యుఫోరియా' సిరీస్ తో అయితే తన కట్ అవుట్ కి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. వివాదాలని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిపించుకొనే ఆత్మీయ బంధువులా లూప్ లైన్ లో ఉంచుకునే 'సిడ్నీ స్వీనీ' మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర వివాదంలో చిక్కుకొని గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్పోర్ట్స్ ప్రిడిక్షన్, ట్రేడింగ్ వేదిక'నోవిగ్' (Novig) అనే బ్రాండ్ ప్రచారం కోసం సిడ్నీ స్వీనీ చేసిన నూతన స్పోర్ట్స్ ప్రకటన సోషల్ మీడియా వేదికల్లో వైరల్ కావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల నుంచి తీవ్ర విమర్శలని ఎదుర్కొంటోంది.
యాడ్‌లో సిడ్నీ స్వీనీ ఒంటిపై దుస్తులు లేకుండా, కేవలం టెన్నిస్ రాకెట్లు, బాస్కెట్‌బాల్స్, ఫుట్‌బాల్స్, హాకీ స్టిక్స్ మరియు వివిధ క్రీడా పరికరాల సహాయంతో శరీరాన్ని కప్పుకుంటూ ఉంది. అయితే నోవిగ్ బ్రాండ్ కేవలం స్పోర్ట్స్ ప్రిడిక్షన్ మార్కెట్ అని చాటిచెప్పడమే దీని ప్రధాన ఉద్దేశమని సదరు కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. అంతేకాకుండా, మొదటి నుంచి ఈ ప్రచారాన్ని ఎంతో క్రియేటివ్‌గా, హ్యూమర్ మరియు కాన్ఫిడెన్స్‌తో రూపొందించడంలో తాను స్వయంగా భాగస్వామ్యం వహించానని సిడ్నీ స్వీనీ గతంలో చెప్పుకొచ్చింది. అయితే, యాడ్ విడుదలైన కొద్దిసేపటికే ప్రపంచం నలుమూలల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా క్రీడా ప్రపంచం నుండి ప్రతికూల స్పందనలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియాకు చెందిన నాలుగు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, మాజీ స్విమ్మర్ అరియార్న్ టిట్మస్ ఈ ప్రచారంపై సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించింది. మహిళా అథ్లెట్లు క్రీడల్లో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, గౌరవం సాధించడానికి కొన్ని దశాబ్దాలుగా ఎంతో కష్టపడుతుంటే, కేవలం బ్రాండ్ ప్రచారం కోసం మహిళల శరీరాలను ఇలా సరుకుగా మార్చడం దారుణమని మండిపడ్డారు. బ్రిటీష్ రన్నర్ ఏమీ హంట్, యుఎస్ జిమ్నాస్ట్ గ్రేసీ క్రామర్, రగ్బీ ప్లేయర్ సోఫీ ఫెల్లా వంటి పలువురు క్రీడాకారిణులు కూడా ఈ యాడ్‌ను తీవ్రంగా తప్పుపట్టారు.

Also Read: ఎపిక్ షాకింగ్ కలెక్షన్స్: డిజాస్టర్ అంటుంది ఎవరు!
అయితే ఈ వ్యాఖ్యలపై సిడ్నీ స్వీనీ నేరుగా ఏ ప్రకటన చేయకుండా, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ఆసక్తికరమైన సైలెంట్ కౌంటర్ ఇచ్చారు. గతంలో స్పోర్ట్స్ విభాగంలో ప్రముఖ మ్యాగజైన్లకు నగ్నంగా లేదా దాదాపు దుస్తులు లేకుండా ఫొటోషూట్లు చేసిన దిగ్గజ అథ్లెట్ల ఫొటోలను ఆమె వరసగా షేర్ చేశారు. అందులో టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్, బాస్కెట్‌బాల్ స్టార్ మేగన్ రాపినో, యూఎఫ్‌సీ ఫైటర్ రోండా రౌసీ, ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్స్ రాబ్ గ్రోంకోవ్స్కీ, జేసన్ కెల్స్ వంటి దిగ్గజాల ESPN 'బాడీ ఇష్యూ' ఫొటోషూట్స్ ఉన్నాయి. క్రీడా దిగ్గజాలు చేసినప్పుడు లేని అభ్యంతరం, తన వరకు వచ్చేసరికి ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారనే ప్రశ్నని ఆమె పరోక్షంగా లేవనెత్తి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. గత ఏడాది అమెరికన్ ఈగిల్ డెనిమ్ బ్రాండ్ ప్రచారంతో చర్చనీయాంశమైన రెండు సార్లు ఎమ్మీ నామినీ పొందిన ఈ హాలీవుడ్ నటి, ఇప్పుడు ఈ కొత్త గ్లోబల్ స్పోర్ట్స్ యాడ్ వివాదంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచారు.
[Sydney Sweeney , Sports Ad Controversy, Telugu Cinema, Telugu Cinema News, Tollywood Cinema News, Tollywood]






