
బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఈ నెల 11 న వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లోకి వచ్చిన మూవీ ‘ఎపిక్. ఫస్ట్ సెమిస్టర్ అనేది టాగ్ లైన్. సితార నాగవంశీ, 90 's దర్శకుడు ఆదిత్య హాసన్ ఎపిక్ కి మూల స్థంబాలు కావడం, ప్రీమియర్స్ కూడా ప్రదర్శించడంతో అభిమానులు, సినీ ప్రేమికులు మరో సారి మెస్మరైజ్ చేసే సినీ ఆనందం తమ సొంతమవడం ఖాయమని భారీగానే పోటెత్తారు. పైగా అవసరం ఉన్నా లేకపోయినా తమ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఎపిక్ ప్రీమియర్ కి వచ్చానని గర్వంగా చెప్పుకున్నారు. తీరా సినిమా చూసాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకొనే పరిస్థితి .
దీంతో ప్రిమియర్ షోల నుంచే నెగిటివ్ టాక్ రావడంతో, తొలి రోజు నుంచే కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. . ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కేవలం నామమాత్రపు వసూళ్లతో సరిపెట్టుకున్న ఈ చిత్రం, రెండవ రోజుకూ వచ్చేసరికి కలెక్షన్లలో మరింత క్షీణతను నమోదు చేసింది. మొదటి రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 6 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించగలిగింది. భారతదేశం అంతటా మొదటి రెండు రోజుల్లో 3.71 కోట్ల గ్రాస్ వసూలవ్వగా, విదేశీ మార్కెట్ల నుండి వచ్చిన కలెక్షన్లు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. శని, ఆదివారాల్లో కూడా థియేటర్ల వైపు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక మొదటి వీకెండ్ చివరినాటికి అంటే మూడవ రోజు పూర్తయ్యేసరికి, ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మొత్తం ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు 6.64 కోట్లకి చేరుకున్నాయి. , ఇండియా గ్రాస్ కలెక్షన్లు 4.99 కోట్లు కాగా ఓవర్సీస్ 1.65 కోట్ల గ్రాస్.

Also Read: పవన్ కళ్యాణ్‌ని ఓడించిన నాగ చైతన్య: ఇది మామూలు మాస్ కాదు!
ఈ కలెక్షన్స్ పై ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రెజెంట్ బుక్ మై షో లాంటి యాప్స్ లో పచ్చ మార్కు తన జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. యూత్ లవ్ స్టోరీ అంటే శృంగారం తప్ప మరేమి ఉండదా అనే కోపంతో ప్రేక్షకులు డిజాస్టర్ అంటున్నారనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అసలు అలాంటి జోనర్స్ కి ఇక సెల్యులాయిడ్ పై చోటు ఉండకపోచ్చనే మాట కూడా వినపడుతుంది.
[Epic , Epic Collections, Anand Deverakonda, Vaishnavi Chaitanya, Telugu Cinema, Telugu Cinema News, Tollywood Cinema News, Tollywood]






