Home

»

Latest News

సూర్య సినిమాకి నో చెప్పిన క్రేజీ బ్యూటీ: ఫ్యాన్స్ షాక్!

Nov 4, 2026 11:19AM


సౌత్ బాక్స్ ఆఫీస్ కి దొరికిన అరుదైన సినీ వజ్రాయుధం  హీరో సూర్య. ఓన్ తమిళ్ లో ఎంత పాపులారిటీ ఉందో, అంతే పాపులారిటీ తెలుగుతో పాటు మిగతా లాంగ్వేజస్ లో ఉంది. అలాంటి సూర్య తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఒక హీరోయిన్ మూడు సార్లు నో చెప్పింది. దీంతో ఫాన్స్ షాక్ అవుతున్నారు. మరి ఆ ముద్దుగుమ్మ ఎవరో చూద్దాం.

    

సూర్య ఈ నెల 6 న మరో సారి బాక్స్ ఆఫీస్ పై తన కట్ అవుట్ కి ఉన్న స్టామినాని తెలియచేయడానికి 'సీన్' మూవీతో వస్తున్నాడు. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో సూర్య సీన్ లో తనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న నజ్రియా కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సాధారణంగా ఏ హీరో సినిమాలోనైనా హీరోయిన్‌గా నటించే అవకాశం వస్తే ఎవరైనా వెంటనే అంగీకరిస్తారు, కానీ నజ్రియా మాత్రం సూర్య సరసన నటించే అవకాశాన్ని ఏకంగా మూడు సార్లు తిరస్కరించిందట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన సూర్య.. తాము గతంలో నజ్రియాను తమ మూడు సినిమాలలో నటించాల్సిందిగా సంప్రదించామని, అయితే వివిధ కారణాల వల్ల ఆమె ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో ఆమె తమ చిత్రంలో నటించడానికి అంగీకరించిందని సూర్య నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. 

ఇది కూడా చదవండి: జెడి చక్రవర్తి కాళ్ళు మొక్కిన నీహారిక కొణిదెల: రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!

 


అంతేకాకుండా, గత 12 ఏళ్లలో నజ్రియాకు తమిళ పరిశ్రమ నుంచి పలు భారీ చిత్రాలలో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ, ఆమె నచ్చిన స్క్రిప్ట్‌ల కోసం వాటిని రిజెక్ట్ చేసిందని తెలిపారు. మంచి క్యారక్టర్ ల  కోసం వేచి చూసే ఆమె ఆత్మవిశ్వాసాన్ని, కెరీర్‌పై ఉండే స్పష్టతను సూర్య ఎంతగానో ప్రశంసించారు.   మరోవైపు, నజ్రియా మాట్లాడుతూ.. దాదాపు 12 సంవత్సరాల విరామం తర్వాత తాను తమిళ చిత్రసీమలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రధాన కారణం సూర్య గారే అని స్పష్టం చేశారు. గతంలో కొన్ని వ్యక్తిగత మరియు కథా పరమైన కారణాల వల్ల ఆయనతో కలిసి పనిచేయలేకపోయినప్పటికీ, ఇప్పుడు ఈ 'సీన్' సినిమా ద్వారా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. మరి నాలుగోసారి కలుసుకున్న ఈ క్రేజీ ద్వయం ఎలాంటి మెరుపులు సెల్యులాయిడ్ కి అందిస్తుందో చూడాలి.

 

[Suriya ABout Nazriya, Nazriya About Suriya, scene movie, suriya upcoming films, nazriya nazim comeback, jithu madhavan director, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com