
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు మరో క్రేజీ ఆఫర్ దక్కింది. ఇప్పటికే తమిళంలో ధనుష్ సరసన 'ఓం' సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలోనూ భాగమైంది. రజినీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న 'ధర్మన్' సినిమాలో శ్రీలీల నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రజినీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. తాజాగా శ్రీలీల ఎంట్రీతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. 'షీ ఈజ్ గాట్ ది స్పార్క్.. షీ ఈజ్ గాట్ ది పటాకా' అనే ట్యాగ్‌లైన్‌తో ఆమెను టీమ్‌లోకి ఆహ్వానించారు.
ఇక శ్రీలీల ఎంట్రీకి సంబంధించిన గ్లింప్స్ చూస్తుంటే.. ఆమె పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉండబోతున్నట్లు అనిపిస్తోంది. అయితే సినిమాలో ఆమె ఎలాంటి పాత్రలో కనిపించనుంది? రజినీకాంత్‌తో ఆమెకు ఎలాంటి సన్నివేశాలు ఉంటాయి? అనే విషయాలను మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.
ఇక 'ధర్మన్'లో ఇప్పటికే నయనతార, సిమ్రన్, రాశీ ఖన్నా వంటి ప్రముఖ నటీమణులు భాగమయ్యారు. రజినీకాంత్‌తో పాటు రామ్ పోతినేని కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'ఓ మై కడవులే', 'డ్రాగన్' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు.. ఈసారి రజినీకాంత్‌ను డిఫరెంట్ అవతార్‌లో చూపించబోతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: లండన్‌లో ఒకే చోట పవన్, షారుఖ్.. అప్పటి సీక్రెట్స్ బయటపెట్టిన రేణు దేశాయ్.!
[Sreeleela Joins Rajinikanth Dharman, Sreeleela Dharman Glimpse, Dharman Movie, Sreeleela, Rajinikanth, Ashwath Marimuthu, Kamal Haasan, Anirudh Ravichander, Ram Pothineni, Telugu Film News]





