
రూమర్ కి ఎలాంటి బస్ ఛార్జి, ఫ్లైట్ ఛార్జి ఉండవు కాబట్టి జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతుందనే నానుడి ఉంది. అందుకే ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఇమిడియెట్ గా మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చే పరిస్థితి.
అను ఇమ్మాన్యుయేల్ నటనకి పూర్తిగా గుడ్‌బై చెప్పేసి రిటైర్మెంట్ తీసుకుంటోందంటూ సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ రూమర్లపై అను ఇమ్మాన్యుయేల్ స్పందిస్తు 'నేను సినిమాలకి గుడ్‌బై చెబుతున్నానని ఎవరు చెప్పారు? అలా నేను ఎప్పుడూ అనలేదు, ఎప్పటికీ అనను కూడా. అసలు ఇలాంటి అవాస్తవ ప్రచారాలను ఎవరు మొదలుపెడతారో నాకు అర్థం కావడం లేదు. సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్లే ఆలోచన నాకు ఏమాత్రం లేదు. గతం లోలాగా కంగారుపడి ఏదో ఒక రొటీన్ కమర్షియల్ సినిమా చేయకుండా, నటనకు ఆస్కారమున్న మంచి వైవిధ్యమైన కథలు, బలమైన పాత్రల కోసమే వేచి చూస్తున్నాను. త్వరలోనే నా తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక అప్‌డేట్‌లను ప్రకటిస్తాను" అని చెప్పారు. అను ఇచ్చిన ఈ స్పష్టమైన ప్రకటనతో మాహిష్ పతి సామ్రాజ్యము ఊపిరి పీల్చుకునే కంటే ఎక్కువగా ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతే కాకుండా రూమర్లకి దవడ వాసే పరిస్థితి.

Also Read: ది ప్యారడైజ్ టైటిల్ 'సమ్మక్క' గా మారితే!
నేచురల్ స్టార్ నానితో కలిసి 2016 లో వచ్చిన 'మజ్ను' సినిమాతో టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టిన మలయాళ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్. తొలి చిత్రంతోనే తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, చలాకీ నటనతో కుర్రకారు మనసులను దోచుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'అజ్ఞాతవాసి', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటించి మెప్పించింది. అయితే ఈ బిగ్ ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయాన్ని అందుకోకపోవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ కాస్త నెమ్మదించింది. ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, శైలజారెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్, ఊర్వశివో రాక్షసివో వంటి వరుస చిత్రాలలో నటించినప్పటికీ సరైన హిట్ పడకపోవడం, కార్తి సరసన చేసిన తమిళ చిత్రం 'జపాన్' నిరాశపరచడంతో ఆఫర్లు సన్నగిల్లాయి. అందుకే అంటారు ఎంత టాలెంట్ ఉన్నా , అదృష్టం ఆవగింజంత అయినా ఉండాలని. అది లేకపోతే అను ఇమ్మానియేల్ విషయంలో వచ్చిన రూమర్స్ సరికొత్త ముసుగులో పుడుతూనే ఉంటాయి.
[Anu Emmanuel, Anu Emmanuel Clarifies Rumors, Pawan Kalyan, Retirement Rumors, Tollywood Updates, TeluguCinema News, TeluguCinema, Tollywood, Tollywood News]






