Home

»

Latest News

సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య బ్రేక్ అప్ అయ్యిందా!

Sep 12, 2026 5:04PM

 

సినీ ప్రేమికుల్ని, సంగీత ప్రియుల్ని నిద్రలో లేపి పలరించండి... సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబో ఒక లెవల్, వాళ్ళ కాంబోలో వచ్చిన మొదటి సినిమా దగ్గరనుంచి అన్ని పాటలు వరుసగా వింటూనే ఉన్నాను. ఆర్ సి 17 సాంగ్స్  కోసం వెయిటింగ్ అని అంటుంటారు. అంతలా ఆ ఇద్దరి కాంబోకి క్రేజ్ ఉంది. సుకుమార్ మొదటి సినిమా ఆర్య దగ్గర్నుంచి ప్రీవియస్ పుష్ప 2 వరకు దేవినే మ్యూజిక్. దీన్ని బట్టి ఆ కాంబోకి ఏర్పడిన ఫ్యాన్ బేస్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.     

దాదాపు 20 ఏళ్లకు పైగా కొనసాగిన ఈ సుదీర్ఘ అనుబంధంలో వీరి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో మ్యూజికల్ చార్ట్‌బస్టర్స్ మరియు సరికొత్త రికార్డులను నెలకొల్పింది.  అయితే,  రామ్ చరణ్, సుకుమార్ ల  RC17 తో  ఈ కాంబోకి బ్రేక్ పడనుందనే వార్తలు టాలీవుడ్‌లో వైరల్ గా మారాయి . 2024 హోలీ పండగ సందర్భంగా ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించినప్పుడు రిలీజ్ చేసిన ఫస్ట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌పై దేవిశ్రీ ప్రసాద్ పేరే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ఆస్థాన సంగీత దర్శకుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

 

 


Also Read: యూత్ మూవీ అంటే బూతు సినిమానేనా: ఎపిక్ లో ఏం చెప్పారు!

 ఈ మార్పు వెనుక ఇటీవల విడుదలైన 'పుష్ప 2: ది రూల్' చిత్రం నిర్మాణ సమయంలో తలెత్తిన తీవ్రమైన క్రియేటివ్ డిఫరెన్సెస్ ముఖ్య కారణమని ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది. సినిమా విడుదలకు సమయం చాలా తక్కువగా ఉండటం, అనుకున్న గడువులోగా రీ-రికార్డింగ్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) అవుట్‌పుట్ రాకపోవడంతో సుకుమార్ ఇతర సంగీత దర్శకులైన ఎస్.ఎస్. తమన్, సామ్ సి.ఎస్ సేవలను అత్యవసరంగా ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామంతో ఇద్దరి మధ్య కొంత దూరం పెరిగిందని, అందువల్లే RC17 ప్రాజెక్ట్ నుంచి దేవిశ్రీ బయటకు వచ్చాడని టాక్. ఈ క్రమంలోనే సుకుమార్ తన తదుపరి చిత్రం కోసం సరికొత్త సౌండింగ్ అండ్ మ్యూజిక్ అందిచేందుకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్, కోలీవుడ్ యంగ్ సెన్సేషన్స్ సాయి అభ్యంకర్, హర్షవర్ధన్ రామేశ్వర్ లేదా అనిరుధ్ రవిచందర్ వంటి ఇతర సంగీత దర్శకుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా  సగటు సినీ, సంగీత అభిమాని RC 17  కి సుకుమార్, దేవి కలిసి పని చేయాలని తమ ఇష్టదైవాన్ని కోరుకుంటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్పెషల్ సాంగ్స్ ప్రేమికులు కూడా.

 

 

 

[RC17, Sukumar, Devisriprasad, Split Rumours, Pushpa 2 creative differences, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com