Home

»

Latest News

ఎవరు ఆ స్టార్ హీరోయిన్స్: దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ నిజాలు

Sep 12, 2026 6:05PM

 

 

టంగ్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు, ఒక్కోసారి మన కళ్ళ ముందు కనపడే, వినపడే దాంట్లో కూడా నిజం ఉండకపోవచ్చు.  ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త మంది సినీ తారల గురించి వస్తున్న న్యూస్ కూడా ఆ కోవలోకే రావచ్చు. 


దుబాయ్ అనగానే మనందరికీ మెరిసే స్కైస్క్రేపర్లు, లగ్జరీ కార్లు, కళ్ళు మిరుమిట్లు గొలిపే విలాసవంతమైన ప్రపంచం మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ఆ ఛమక్కుల వెనుక క్రికెట్ బెట్టింగ్, అండర్‌వరల్డ్ దందాలు, సినిమా గ్లామర్ల మధ్య నడిచే ఒక చీకటి సామ్రాజ్యం ఉందనేది నమ్మలేని సత్యం. ఆంతరంగికంగా నడిచే ఈ రహస్య వ్యవహారాలపై బుకీ అమిత్ మజిథియా బయటపెట్టిన సంచలన నిజాలు ఇప్పుడు క్రీడా, సినీ వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. దుబాయ్‌లో ప్రైవేట్ షేక్‌లు, వ్యాపారవేత్తలు నిర్వహిచే రహస్య పార్టీలకు వేల కోట్ల రూపాయల నల్లధనం ఎలా ప్రవహిస్తుందో ఆయన బహిర్గతం చేశారు. ఈ సీక్రెట్ విందుల్లో పాలుపంచుకోవడానికి బాలీవుడ్ టాప్ నటీమణులు, మోడళ్లు ప్రత్యేకంగా విమానాల్లో చేరుకుంటారు. ముఖం ఎవరకి కనపడకుండా బుర్హాలు ధరిస్తారు. వాళ్లెవరో జనాలకి బాగా తెలుసు   అక్కడ జరిగే నృత్య వేడుకలు, ముజ్రాల కోసం కోట్ల రూపాయలు చెల్లిస్తారని వివరించారు.

ఈ వ్యవహారంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే ప్రముఖ స్టార్ క్రికెటర్లు కూడా ఈ సీక్రెట్ దుబాయ్ విందుల్లో భాగమవుతుండటమే! ప్రైవేట్ విల్లాలు, లగ్జరీ యాచ్‌లలో జరిగే ఈ ప్రైవేట్ పార్టీల్లో క్రికెటర్లు, బాలీవుడ్ భామలు, బుకీలు ఒకే వేదికపై కలుసుకుంటారని అమిత్ మజిథియా పేర్కొన్నారు. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ సమాచారం మార్పిడికి కూడా ఈ నైట్ పార్టీలే ప్రధాన వేదికలుగా మారుతున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా సోషల్ మీడియాలో ఎంతో పద్ధతిగా కనిపించే పబ్లిక్ ఫిగర్స్, దుబాయ్ చీకటి గదుల్లో నిర్వహించే ముజ్రా పార్టీల్లో మద్యం, విలాసాల నడుమ ఎలా మునిగితేలుతారో ఆయన వివరంగా వెల్లడించారు.

 

 

 

Also Read: సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య బ్రేక్ అప్ అయ్యిందా!

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ దందాల ద్వారా ప్రతి ఏడాది 100% కంటే ఎక్కువ రాబడి సాధిస్తూ కోట్ల విలువైన అక్రమ లావాదేవీలు జరుగుతాయని అంచనా. ఈ ప్రైవేట్ ఈవెంట్లలో ఒక్కో ముజ్రా లేదా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం రూ. 50 లక్షల నుండి రూ. 2 కోట్ల వరకు నటీమణులకు పారితోషికంగా ఇస్తారని సమాచారం. దుబాయ్‌లో చట్టాల పరిమితులు, ప్రైవేట్ విల్లాల కఠినమైన భద్రత కారణంగా 99% సందర్భాల్లో ఈ వివరాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతారు. కేవలం 1% సంఘటనలు మాత్రమే ఏదో ఒక లీక్ ద్వారా లేదా దర్యాప్తు సంస్థల నిఘా ద్వారా వెలుగులోకి వస్తాయి. ఈ విందులకు హాజరయ్యే వారి ఫోన్లను సైతం ఎంట్రీ వద్దే స్వాధీనం చేసుకుంటారంటే అక్కడ ఎంత రహస్య వాతావరణం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

దుబాయ్ వేదికగా సాగుతున్న ఈ గ్లామరస్ నెట్‌వర్క్ వెనుక ఉన్నది కేవలం వినోదం మాత్రమే కాదని, దీని వెనుక దాదాపు 1,00,000 కోట్లకు పైగా విలువైన అంతర్జాతీయ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, హవాలా దందాలు ముడిపడి ఉన్నాయని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.  

 

 

[Amit Majithia,  Dubai Secrets, Heroins, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com