Home

»

Latest News

Sing Geetham: 'సింగ్ గీతం' టీమ్‌కు రాజమౌళి బిగ్ సర్‌ప్రైజ్!

Jun 10, 2026 4:45PM

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్స్ పై నాగ్ అశ్విన్ నిర్మించిన సరికొత్త చిత్రం 'సింగ్ గీతం' (Sing Geetham). ఈ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌కు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జూన్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఒక ఊహించని బిగ్ సర్ప్రైజ్‌ను అభిమానులతో పంచుకుంది.

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ఈ సినిమాకు సంబంధించి సరికొత్త హంగామా సృష్టించారు. 'సింగ్ గీతం' ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిన తరుణంలో, చిత్ర బృందంతో నేరుగా లైవ్ వీడియో కాల్ మాట్లాడిన రాజమౌళి అందరినీ ఆశ్చర్యపరిచారు. నాగ్ అశ్విన్, దేవి శ్రీ ప్రసాద్‌లతో సరదాగా ముచ్చటిస్తూ, తాను అప్పుడే ఆన్‌లైన్‌లో బుక్ చేసిన ఫస్ట్ టికెట్‌ను తన మొబైల్ స్క్రీన్‌పై చూపించి సర్ప్రైజ్ ఇచ్చారు. బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నామని రాజమౌళికి చెప్పాలనుకున్న మేకర్స్, ఆయన అప్పటికే టికెట్ కొనేయడం చూసి షాక్‌కు గురయ్యారు.

ఈ క్రేజీ మూమెంట్‌ను క్యాప్చర్ చేస్తూ విడుదల చేసిన ప్రత్యేక ప్రమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వీడియో చివర్లో దేవి శ్రీ ప్రసాద్, నాగ్ అశ్విన్ కలిసి తమదైన శైలిలో పాట పాడుతూ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయంటూ సందడి చేశారు. జూన్ 12న విడుదల కానున్న ఈ సినిమాకు జక్కన్న స్వయంగా మొదటి టికెట్ కొని తన మద్దతు తెలపడంతో, ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com