
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan),బుచ్చిబాబు(Buchibabu)కాంబినేషన్‌లో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'(Peddi)బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటని కొనసాగిస్తోంది. జూన్ 4 న వరల్డ్ వైడ్ గా విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మిశ్రమ సమీక్షలు మరియు కొన్ని వివాదాలు నడుస్తున్నప్పటికీ, చరణ్ అద్భుతమైన పెర్ఫార్మ్ ప్రేక్షకులని థియేటర్లకి రప్పిస్తుంది.
'పెద్ది' 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 332.1 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు. కేవలం ఇండియాలోనే 213.23 కోట్ల గ్రాస్ కాగా నెట్ కలెక్షన్స్ దాదాపు 179.35 కోట్లుగా నమోదయ్యాయి. ఈ చిత్రం బుధవారం నాటి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే 18.50 కోట్ల భారీ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత గురువారం మొదటి రోజు ఇండియాలో 51 కోట్ల నెట్ కలెక్షన్స్, 2వ రోజు 26.90 కోట్లు, 3వ రోజు 28.85 కోట్లు, ఆదివారం అయిన నాలగవ రోజు అత్యధికంగా 32.15 కోట్ల నెట్ వసూళ్లని సాధించి వీకెండ్‌లో దుమ్మురేపింది.
Also read: మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కిన జయం రవి భార్య.. ఈ సారి ఎందుకో తెలిస్తే షాక్ గ్యారంటీ
సోమవారం (5వ రోజు) 12.05 కోట్లతో పర్వాలేదనిపించగా మంగళవారం (6వ రోజు) నాటికి 19.9 శాతం స్వల్ప డ్రాప్‌తో 9.65 కోట్ల నెట్ వసూళ్లని రాబట్టింది. వర్కింగ్ డేస్ అయినప్పటికీ, దేశవ్యాప్తంగా ఉన్న 7,554 థియేటర్ల షోలలో ఈ స్థాయి కలెక్షన్స్ రావడం విశేషం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అత్యంత బలంగా నిలిచింది. మొత్తం 6వ రోజు కలెక్షన్లలో తెలుగు వెర్షన్ నుంచే 7.75 కోట్లు రావడం విశేషం, అలాగే హిందీ వెర్షన్ 1.65 కోట్లు కాగా, తమిళ్ వెర్షన్ నుండి 15 లక్షలు వచ్చాయి. మిగిలిన కన్నడ మరియు మలయాళ వెర్షన్లలో కూడా చిన్న మొత్తంలో వసూళ్లు నమోదయ్యాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం ఆరు రోజుల్లో దాదాపు 5 మిలియన్ డాలర్లు (48 కోట్ల గ్రాస్) సాధించి విదేశాల్లోను చరణ్ క్రేజ్‌ని చాటిచెప్పింది.
.webp)





