.webp)
టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివంగత నటుడు శ్రీహరి కుటుంబంలో త్వరలో శుభకార్యం జరగనుంది. ఆయన పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. శశాంక్ వివాహం సంజన అనే యువతితో నిశ్చయమైనట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో శ్రీహరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శశాంక్ శ్రీహరి, సంజనల నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న ఇరు కుటుంబాల సమక్షంలో ఈ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.
శ్రీహరి కుటుంబానికి సన్నిహితులైన స్నేహితుల కుటుంబానికి చెందిన అమ్మాయితోనే శశాంక్ వివాహం నిశ్చయమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
.webp)
శ్రీహరి, శాంతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శశాంక్ కాగా, చిన్న కుమారుడు మేఘాంశ్ శ్రీహరి. తండ్రి బాటలోనే మేఘాంశ్ నటుడిగా సినిమాల్లోకి వచ్చారు. ‘రాజ్‌దూత్’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు శశాంక్‌కు మాత్రం దర్శకత్వంపై ఆసక్తి ఉంది.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌ను చూసి మిగతా స్టార్స్ మారతారా.?
‘రియల్ స్టార్’ శ్రీహరి తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎన్నో విభిన్న పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా ‘మగధీర’లో షేర్‌ఖాన్ పాత్ర ఆయనకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. 2013లో ఆయన మరణించినా, సినిమాల ద్వారా ప్రేక్షకుల మనసుల్లో ఇప్పటికీ నిలిచిపోయారు.
.webp)
ఇప్పుడు పెద్ద కుమారుడు శశాంక్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుండటంతో శ్రీహరి కుటుంబంలో పెళ్లి సందడి మొదలుకానుంది. త్వరలోనే ఈ నిశ్చితార్థానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాబోయే వధూవరులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
మీకు నచ్చవచ్చు:
సెన్సార్ వాళ్లనే భయపెట్టిన మూవీ.. అప్పుడే ఓటీటీలోకి ఆ హారర్ థ్రిల్లర్.!
ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, ప్రభాస్.. సందీప్ రెడ్డి అభిమానం చూపిస్తాడా.?
[Srihari Son, Shashank Srihari, Sanjana, Engagement, Marriage]






