
శ్రీలీల కాలు కదిపితే ఏమవుతుందో తెలిసిందే. బాక్స్ లు బద్దలవ్వడమే. అంతలా తన డాన్స్ తో సెల్యులాయిడ్ ని షేక్ చేసి పడేస్తుంది. ఆ కనువిందు స్పెషల్ సాంగ్స్ తో కూడా కలిగిస్తాననే మాట ఇచ్చి 'పుష్ప 2 ' లో దెబ్బలు పడతాయిరో అంటూ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని రఫ్ఫాడించింది.
ఇప్పుడు ఈ భామ రజనీకాంత్ నో కలిసి చిందేయనుంది. రజినీ ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’ షూటింగ్ ప్రస్తుతం మైసూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా, తాజాగా మైసూర్ షూటింగ్ షెడ్యూల్‌కి సంబంధించిన కొన్ని విజువల్స్, లీక్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలలో శ్రీలీల కనిపించడంతో నెటిజన్లు, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అందరూ అనుకున్నట్లుగా శ్రీలీల ఇందులో కేవలం ఒక చిన్న పాత్రలోనో లేదా సెకండ్ హీరోయిన్‌గానో నటించడం లేదని, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలసి ఒక హై-వోల్టేజ్ ఊరమాస్ స్పెషల్ సాంగ్‌లో మెరిసిపోనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

శ్రీలీల మరోసారి భారీ ప్రాజెక్ట్‌లో మాస్ ఐటమ్ నంబర్‌కు సైన్ చేయడం విశేషం. ఈ మాస్ నంబర్‌కు తమిళ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. తలైవా మాస్ మేనరిజమ్స్, శ్రీలీల అద్భుతమైన డాన్స్ స్టెప్పులు ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మైసూర్‌లో చిత్రీకరించిన ఈ ప్రత్యేక గీతం షూటింగ్‌లో రజనీకాంత్, శ్రీలీలలతో పాటు యంగ్ హీరో రామ్ పోతినేని, అలాగే రాశీ ఖన్నా కూడా పాల్గొనడం ఈ పాటపై ఉన్న క్యూరియాసిటీని మరింత పెంచేసింది. సాధారణంగా రజనీకాంత్ సినిమాల్లో నటించడం అంటే ప్రతీ ఆర్టిస్ట్‌కు ఒక కల. అందుకే శ్రీలీల కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి పట్టుదలకు పోకుండా, సూపర్ స్టార్ సినిమా కావడం, పవర్ ఫుల్ కాంబినేషన్ కుదరడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను లోకనాయకుడు కమల్ హాసన్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
]Sreeleela Special Song Rajinikanth Dharman Movie, Sreeleela, Rajinikanth, Dharman Movie, Sreeleela Special Song, Anirudh Ravichander,kamal Haasan, Telugu Cinema News, Telugu cinema, Tollywood News, Tollywood]
.webp)






