
పెద్ద సినిమా వస్తుందంటే చాలు.. టికెట్ రేట్లు పెరుగుతాయనే చర్చ మొదలవుతోంది. ముఖ్యంగా పండుగ సీజన్‌లో భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుంటే.. టికెట్ ధరల పెంపుపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ ‘రణబాలి’ విషయంలోనూ అదే జరిగింది.
దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రణబాలి’ టికెట్ రేట్లు పెంచబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు పెంచుకునేందుకు మేకర్స్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారనే టాక్ బాగా వైరల్ అయింది.
దీంతో ‘రణబాలి’ చూడాలంటే జేబుకు కాస్త ఎక్కువే చిల్లు పడుతుందేమోనని ప్రేక్షకులు భావించారు. మరీ పండుగ సీజన్ కావడంతో టికెట్ ధరల పెంపుపై ఈ చర్చ మరింత పెరిగింది.
అయితే ఈ వార్తలకు చిత్ర బృందం తాజాగా చెక్ పెట్టింది. టికెట్ రేట్ల పెంపు కోసం తాము ఎలాంటి దరఖాస్తు చేయలేదని మేకర్స్ స్పష్టం చేశారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ టికెట్ ధరలు పెంచేందుకు ఎలాంటి అనుమతి కోరలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పారు.
అంతేకాదు.. ‘రణబాలి’ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణ టికెట్ ధరలతోనే థియేటర్లలోకి రానుందని మేకర్స్ తెలిపారు. పండుగ సీజన్‌లో ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే స్టాండర్డ్ ధరలకు రిలీజ్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ‘ఆదర్శ కుటుంబం’ మళ్ళీ వాయిదా.. నాగవంశీ క్లారిటీ ఇచ్చిన 3 రోజులకే షాక్.!
[No Ticket Hike for Ranabaali, Ranabaali Ticket Hike, Ranabaali Movie, Vijay Rashmika Movie, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Mythri Movie Makers, Telugu Film News]






