
కలెక్షన్ల తుఫాన్ వచ్చే ముందు బాక్స్ ఆఫీస్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అంతే ప్రశాంతంగా వచ్చి కలెక్షన్ల పెను తుఫాన్ సృష్టించింది స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే'. చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా అందరూ స్పైడర్ మాన్ మాస్క్ లు ధరించి థియేటర్స్ కి తరలి వెళ్లారు. ఇప్పుడు వాళ్లంతా మరో సారి తమ ఇంట్లోనే మాస్క్ ధరించనున్నారు.
థియేటర్లలో సుదీర్ఘకాలం విజయవంతంగా ప్రదర్శించబడుతూ అసాధారణ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై తన సందడిని షురూ చేసేందుకు సిద్ధమైంది. దాదాపు 66 రోజుల థియేట్రికల్ రన్ తర్వాత అక్టోబర్ 6 నుంచి, అంటే ఈ రోజు నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ డెబ్యూ (OTT Premium/PVOD) చేస్తోందన్న వార్త సినీ ప్రేమికులకి, స్పైడీ ఫ్యాన్స్‌కు అపరిమిత ఆనందాన్ని ఇస్తోంది. థియేటర్లలో బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను మిస్ అయిన సినీ ప్రియులై ఇది నిజంగా తీపి కబురే.

ఇది కూడా చదవండి: రవితేజ తులాభారంలో తూగబోయే వాళ్ళు వీరేనంటా!
ఇప్పటివరకు 'అవేంజర్స్: ఎండ్ గేమ్', 'అవతార్' చిత్రాలు మాత్రమే 2.5 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరగా, ఆ ప్రతిష్టాత్మక క్లబ్‌లో అడుగుపెట్టిన మూడో చిత్రంగా కూడా 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' తన రికార్డుని చాలా గర్వంగా తన అమ్ముల పొదిలో దాచుకుంది.
[Spider Man Brand New Day In Ott, Spider Man Brand New Day, Spider Man 2.5 billion box office, Spider Man digital debut, TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]





