Home

»

Latest News

రవితేజ తులాభారంలో తూగబోయే వాళ్ళు వీరేనంటా!

Oct 6, 2026 3:13PM

 

మాస్ మహారాజా రవితేజకి ఇరుముడి అదిరిపోయే హిట్ నే కాదు బాధ్యతని కూడా ఇచ్చింది. అందుకే ఇప్పడు హిట్ మేకర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'తులాభారం' చేస్తున్నాడు. హర్రర్ కామెడి అనే టాక్ వినిపిస్తుండటం, టైటిల్ ఏమో తులాభారం కావడంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి


ఈ మూవీలో ఓజి బ్యూటీ  ప్రియాంక అరుల్ మోహన్ , కాకా డాటర్ అనస్వర రాజన్ భాగస్వామ్యం కానున్నట్టు  ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రియాంక మోహన్  హీరోయిన్ కాగా అనశ్వర రాజన్ కీ రోల్ లో కనిపించబోతున్నట్టు కూడా టాక్. మరి ఇదే నిజమైతే అభిమానులకి  తులాభారం మరో కనువిందు  బొమ్మగా నిలబడటం ఖాయం. అంతేకాకుండా విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం. 

ఇది కూడా చదవండి: నయనతార వైట్ బికినీ ఫోటోలు వైరల్: ఏఐ వాడారా! 

 


ఇటీవల హైదరాబాద్ లో లుక్ టెస్ట్ ప్రమోషనల్ ఫోటోషూట్ జరిగింది. ఈ ఫోటోషూట్‌లో రవితేజ, వివేక్ ఆత్రేయలతో పాటు ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. షాడో లుక్‌తో విడుదలైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. మరి ముందు ముందు తులాభారం నుంచి వచ్చే అప్ డేట్స్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.

 

[RaviTeja Thulabharam Movie Cast Update, Ravi Teja Vivek Athreya Movie, Thulabhaaram Telugu Movie, Priyanka Arul Mohan, Anaswara Rajan, TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com