Home

»

Latest News

ఎందుకు ఇట్లా చేసిండ్రు: 'సిగ్మా' టాక్ వెనక ఉన్న అసలు నిజాలు!

Oct 2, 2026 5:16PM

 

ఇళయ దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ మెగాఫోన్ చేపట్టి సందీప్ కిషన్ తో  తెరకెక్కించిన మూవీ 'సిగ్మా'. మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చి మాట్లాడటంతో పాటు విజయ్ కొడుకు డైరెక్టర్ గా డెబ్యూ మూవీ కావడంతో ప్రాజెక్ట్ పై క్రేజ్ అనేది ఏర్పడింది. అయితే షోస్ పడినప్పటి దగ్గర నుంచి  మేకింగ్ అద్భుతంగా ఉందనే ప్రశంసలు వస్తుంటే, మరోవైపు నెగెటివ్ టాక్ కూడా వినిపిస్తుంది.

 ఇందుకు ప్రధాన కారణం కథ, కథనం.. ఏ లాంగ్వేజ్ లో చూసుకున్న సిగ్మా లాంటి  కథలు చాలా వచ్చాయి.  పైగా క్లైమాక్స్ లో  ఏం జరుగుతుందో సినిమా ఫస్ట్ సీన్ లోనే తెలిసిపోతుంది. ప్రిడిక్టబుల్ సీన్లు, సెకండాఫ్ ప్రొసీడింగ్స్ నెమ్మదించాయి. స్క్రీన్‌ప్లేలో ఎలాంటి ట్విస్ట్‌లు లేవు.  కానీ జేసన్ సంజయ్ మేకింగ్ శైలి, షాట్ డివిజన్, సందీప్ కిషన్  టైమింగ్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయని. జాసన్ , సందీప్ మరో కథతో సెల్ల్యులాయిడ్ పైకి వచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని    సినీ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు

ఇది కూడా చదవండి: Sigma Movie Review Telugu: సిగ్మా మూవీ రివ్యూ 

 

రివ్యూస్ కూడా తెలుగు, తమిళ నాట నెగిటివ్ గానే వస్తున్నాయి. మరి తొలి రోజుతో పాటు వీకెండ్ లో ఏ మేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. లండన్, కెనడాలో జాసన్ ఫిలిం మేకింగ్ లో శిక్షణ పొందాడు. 

 

[Sigma Movie Public Talk, Sigma Movie Review Telugu, sigma Movie Review In Telugu, Sigma Movie Review, Sundeep Kishan Sigma Movie Review, Sigma Movie, Jasan Sanjay, Telugu Cinema News, Tollywood CInema News, Tollywood]

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com