
సినిమా పేరు: సిగ్మా
నటీనటులు: సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్, శివ్ పండిట్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్
ఎడిటింగ్: కె ఎల్ ప్రవీణ్
మ్యూజిక్: థమన్
నిర్మాత: సుభాస్కరన్, జికేఎమ్ తమిళ్ కుమరన్
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
రచన,దర్శకత్వం: జాసన్ సంజయ్
రిలీజ్ డేట్ : అక్టోబర్ 2 ,2026
సందీప్ కిషన్ , ఫరియా అబ్దుల్లా ఈ రోజు ఇళయ దళపతివిజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో 'సిగ్మా' తో థియేటర్స్ లో అడుగుపెట్టారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
గురు(సందీప్ కిషన్) తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన లైబ్రరీ ని రన్ చేస్తుంటాడు. తెలుగు సాహిత్యపు అమ్ములపొదిలో ఉన్న జీవిత సత్యాలు, ఆహ్లదకరమైన కవితలతో కూడిన ఎన్నో అద్భుతమైన పుస్తకాలు లైబ్రరీలో ఉంటాయి.నేటి ఆధునిక ప్రపంచాన్ని ఆకట్టుకోవడానికి యూట్యూబ్ లో ఆడియో బుక్ ఛానల్ కూడా నడుపుతుంటాడు. వీరయ్య రెడ్డి(సంపత్) అసాంఘిక శక్తీతో పాటు ప్రమాదకరమైన సీజర్ అనే డ్రగ్ డీలర్.. విన్సెంట్( శివ్ పండిట్) థియేటర్ ఓనర్. కానీ థియేటర్ లోపల మనుషుల జీవితాలని తలకిందులు చేసే జూదాన్ని( గ్యాంబ్లింగ్) నడుపుతుంటాడు. గురు, వీరయ్య రెడ్డి, విన్సెంట్ మధ్య ఏం జరిగింది? అది ఎలాంటి పోరాటానికి దారి తీసింది? పోరాటానికి ఏర్పడిన పరిస్థితులు ఏంటి? చివరికి ఏం జరిగింది? అనేదే సిగ్మా
ఎనాలసిస్
మొత్తం అరగంటలో అయిపోయే కథని రెండున్నర గంటల పాటు లాగారు. ఆ విషయం సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర్నుంచి ఈజీగా తెలిసిపోతుంది. కథకి అవసరం లేని సీన్స్ ఎన్నో వచ్చాయి. కాకపోతే మూవీ చూస్తున్నంత సేపు డబ్బు ఎంత గొప్పదో, దాన్ని సంపాదించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకోవచ్చనే ఐడియా మాత్రం ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సిగ్మా కథ ఆత్మ కూడా అదే. కాబట్టి మేకర్స్ సెకండ్ హాఫ్ లో హీరో క్యారక్టర్ మైండ్ లో డబ్బు పాయింట్ నే బేస్ చేసుకొని కథని సృష్టించుకుంటే బాగుండేది. అలా కాకుండా ఫస్ట్ హాఫ్ లో ఉన్న పాయింట్ నే అనవసరపు లాగ్స్ తో నడిపించారు. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే గురు( సందీప్ కిషన్) ఇంట్రడక్షన్ బాగుంది.
లైబ్రరీ సీన్స్, యూ ట్యూబ్ ఛానల్ ఐడియా, ఆర్ జె సామ్, ( ఫరియా అబ్దుల్లా) గురు మధ్య వచ్చిన సీన్స్, సాంగ్స్ బాగున్నాయి. అసలు ఫస్ట్ హాఫ్ లో అలా స్టెప్ బై స్టెప్ సీన్స్ వెళ్తున్న కొద్దీ సిగ్మా హిట్ అని అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ నుంచే ఫస్ట్ హాఫ్ లో ఉన్న పాయింట్ పైనే వెళ్లారు. దీంతో సీన్స్ బలం లేక తేలిపోయాయి. మరి ముఖ్యంగా గురు డబ్బు డిమాండ్ చేసే తీరు, వాటి ప్లాన్స్ అన్ని దారుణం. చాలా సినిమాల్లో చూసేసాం. ఎంటర్ టైన్ మెంట్ కోణంలో అయినా చెప్పుండాల్సింది. వీరయ్య రెడ్డి క్యారక్టర్ లో సరైన క్లారిఫికేషన్ లేదు. యాక్షన్ సీక్వెన్స్ సైతం బాగోలేదు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ది అదే పరిస్థితి.
నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు
సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ లో మెరుపులు లేవు. రెగ్యులర్ గానే చేసాడు. కాకపోతే క్యారక్టర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. ఫరియా అబ్దుల్లా తన క్యారక్టర్ పరిధి మేరకు మెప్పించింది. సంపత్ నటన కూడా రొటీన్. విన్సెంట్ గా చేసిన శివ్ పండిట్ మాత్రం ఇరగదీసాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్, లుక్స్ తో స్క్రీన్ ని మెస్మరైజ్ చేసాడు. రాజు సుందరం తో పాటు మిగతా నటీనటులు కూడా మెప్పించారు. గురు తల్లిగా చేసిన షీలా రాజ్ కుమార్ కనపడింది కాసేపే అయినా తన సహజమైన అందం లాగానే సహజమైన నటనతో మెప్పించింది. జాసన్ సంజయ్ దర్శకుడిగా భారీగా సక్సెస్ అయ్యాడు. రైటర్ గా భారీగా ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు, ఫొటోగ్రఫీ, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉన్నాయి.
బలాలు
జాసన్ సంజయ్ దర్శకత్వం
ప్రొడక్షన్ వాల్యూస్
బలహీనతలు
కథ
కథనం
చివరిగా చెప్పాలంటే డైరెక్షన్ సూపర్. కానీ ప్రేక్షకులు ఎప్పుడో చూసేసిన 'కథ'ని అనవసరపు సీన్స్ తో నింపేసి 'సిగ్మా'గా మళ్ళీ తీసుకొచ్చారు.
రేటింగ్ 2.25 /5 అరుణాచలం




