Home

»

Latest News

సిగ్మా రికార్డు కలెక్షన్స్: మరి టాక్ ఎలా ఉంది!

Oct 3, 2026 11:15AM

 

 

సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా కాంబోలో విజయ్ సన్ జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'సిగ్మా' . నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వగా ప్రచార చిత్రాలతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

సిగ్మా'మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ వివరాల్లోకి వస్తే  ఇండియా గ్రాస్ కలెక్షన్ 2.70 కోట్లుగా నమోదైంది. రెండు భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో తమిళ వెర్షన్ అత్యధిక ఆదరణ పొందింది. తమిళ వెర్షన్ 925 షోల ద్వారా 1.50 కోట్ల నెట్ కలెక్షన్  రాబట్టగా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి 1.00 కోట్ల గ్రాస్ వసూలు, కర్ణాటకలో 25 లక్షలు, కేరళలో 12 లక్షలు మరియు మిగిలిన భారతదేశ వ్యాప్తంగా ₹3 లక్షల వసూళ్లు వచ్చాయి. థియేటర్ల ఆక్యుపెన్సీ విషయానికి వస్తే, ఇండియా వ్యాప్తంగా సగటున 31.1% ఆక్యుపెన్సీ నమోదైంది. తమిళ వెర్షన్ లో నైట్ షోలకు గరిష్టంగా 51.69% ఆక్యుపెన్సీ రాగా, తెలుగు వెర్షన్ ఈవినింగ్ షోలలో 31.10% ఆక్యుపెన్సీతో నిలకడగా సాగింది.   

ఇది కూడా చదవండి: Dont Trouble The Trouble: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే!

 

మూవీ టాక్ విషయానికి వస్తే డైరెక్షన్ బాగున్నా కథ, కధనం ఓల్డ్ ఫార్మేట్ లో సాగాయనే మాటలు వినపడుతున్నాయి.

 

[Sigma First Day Collections, Sigma box office collection day 1, Sundeep Kishan Sigma worldwide collections, Jason Sanjay directorial debut, Sigma Telugu movie collections]

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com