
ఫాహద్ ఫాజిల్, సారా ఫాలేకర్, రాజమౌళి, రాజమౌళి తనయుడు కార్తికేయ, బాహుబలి నిర్మాతలు నిన్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' తో వరల్డ్ వైడ్ థియేటర్స్ లో అడుగుపెట్టారు. ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కగా శశాంక్ ఏలేటి దర్శకుడు. విలక్షణమైన ప్రమోషన్లతో వచ్చిన ఈ చిత్రం తొలి రోజే అద్భుతమైన వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంది.
వివరాల్లోకి వెళితే ఇండియా వైడ్ గా 1,224 షోలలో ప్రదర్శించబడిన1.90 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆల్ ఇండియా స్థాయిలో తొలి రోజు మొత్తం 25.8 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది.ఈ కలెక్షన్లలో తెలుగు వెర్షన్ ఒక్కటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి అత్యధికంగా 1 .40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు లభించాయి. మొత్తం 31.1 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే . కర్ణాటక నుండి 20 లక్షలు, కేరళ నుండి 20 లక్షలు, తమిళనాడు నుండి 7 లక్షలు మరియు మిగిలిన భారతదేశం అంతటా కలిపి ₹3 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఇది కూడా చదవండి: చిరంజీవి ట్వీట్ వైరల్: హనుమాన్ చాలీసా పఠిస్తూ ఒక్కడే పోరాడాడు
.webp)
ఇతర భాషా వెర్షన్ల విషయానికి వస్తే, మలయాళంలో 341 షోల ద్వారా 17 లక్షల నెట్ కలెక్షన్ (13% ఆక్యుపెన్సీ) నమోదు కాగా, తమిళ వెర్షన్ 60 షోల నుంచి లక్షల నెట్ వసూళ్లను అందించింది. ఉదయం షోలలో 23.15 శాతం, మధ్యాహ్నం మ్యాటినీలకు అత్యధికంగా 34.54 శాతం, సాయంత్రం షోలకు 19.46 శాతం మరియు నైట్ షోలకి 27.92 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్ నగరంలో నైట్ మరియు మ్యాటినీ షోలకు ప్రేక్షకుల స్పందన ఎక్కువగా కనిపించిన డోంట్ 'ట్రబుల్ ది ట్రబుల్' వీకెండ్ ని ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.
[Dont Trouble The Trouble First Day Collections, Dont Trouble The Trouble Review, Fahadh Faasil, Box Office Collection Day 1, SS Rajamouli, Telugu Cinema, Shashank Yeleti, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
.webp)
.webp)






