రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది
on Jan 6, 2026

-ఉస్తాద్ భగత్ సింగ్ గురించి సాక్షి వైద్య చెప్పిన నిజం ఏంటి!
-దీంతో ఇక రూమర్స్ కి చెక్ పడినట్లేనా
-అసలు సాక్షి వైద్య ఏమంటుంది
సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి పుల్ స్టాప్ పడినట్లయింది.
సాక్షి వైద్య రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఉస్తాద్ భగత్ సింగ్ లో కీలకమైన క్యారెక్టర్ ని పోషించే అవకాశం వచ్చింది. రేపే షూటింగ్ ని స్టార్ట్ చేస్తున్నామని యూనిట్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు.కానీ మా ఫ్యామిలీలో ఏర్పడిన అత్యవసర పరిస్థితి కారణంగా వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. దీంతో డేట్స్ సర్దుబాటు లేకపోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆఫర్ వదులుకోవాల్సి వచ్చింది. కానీ నా గత చిత్రాలు ప్లాప్ కావడంతో నన్ను తీసేశారనే వార్తలు చాలానే వచ్చాయి. ప్రేక్షకులు కూడా అదే అనుకున్నారేమో. కానీ నేను మాత్రం అలాంటి వాటిని పట్టించుకోకుండా కెరీర్ లో ముందుకు వెళ్తుంటాను అని సాక్షి వైద్య చెప్పుకొచ్చింది.
సాక్షి వైద్య ఈ నెల 14 న సంక్రాంతి కానుకగా శర్వానంద్ తో కలిసి నారీనారీ నడుమమురారి తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రచార చిత్రాల ద్వారా అయితే సాక్షి వైద్య తన క్యారక్టర్ ద్వారా సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేయబోతోందని తెలుస్తుంది. 2023 లో అఖిల్ అక్కినేని, సురేంద్ర రెడ్డి ల 'ఏజెంట్' మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాక్షి వైద్య వరుణ్ తేజ్ తో గాండీవ దారి అర్జున లో కూడా జత కట్టింది. నారీ నారీ నడుమ మురారి ఆమెకి మూడవ చిత్రం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



