సాయికుమార్ రియల్ స్టోరీతో బొమ్మరిల్లు-2
on Jan 6, 2026

టాలీవుడ్ లో రూపొందిన ఎవర్ గ్రీన్ రొమాంటిక్ కామెడీ ఫిలిమ్స్ లో 'బొమ్మరిల్లు' ఒకటి. సిద్దార్థ్, జెనీలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ 2006 ఆగస్టులో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ ఆగస్టుతో 'బొమ్మరిల్లు' సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ తరుణంలో బొమ్మరిల్లు సీక్వెల్ గురించి నిర్మాత దిల్ రాజు(Dil Raju) మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.
ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'శంబాల' మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలై విజయం సాధించింది. తాజాగా నిర్వహించిన ఈ మూవీ థాంక్యూ మీట్ కి దిల్ రాజు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయికుమార్ రియల్ స్టోరీతో బొమ్మరిల్లు-2 తీయొచ్చని అన్నారు. (Shambhala Thank You Meet)
Also Read: హీరో విజయ్ కి సీబీఐ నోటీసులు!
"20 ఏళ్ళ క్రితం మేము తీసిన బొమ్మరిల్లు సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. బొమ్మరిల్లు ఫాదర్ పాత్ర ఎన్నో ఫ్యామిలీస్ లో చేంజెస్ తీసుకొచ్చింది. ఒకవేళ బొమ్మరిల్లు-2 తీయాల్సి వస్తే.. సాయికుమార్ గారు, ఆది స్టోరీ పెట్టి తీయాలి. కొడుకు సక్సెస్ గురించి తండ్రి పడే తపన మామూలుది కాదు. ఆదికి ఒక్కడికే కాదు.. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ బ్యాక్ బోన్ లా సాయికుమార్ గారు నిలిచారు." అని దిల్ రాజు అన్నారు.
మరి సాయికుమార్ రియల్ స్టోరీతో బొమ్మరిల్లు-2 తీయొచ్చని చెప్పిన దిల్ రాజు.. దానిని నిజం చేసే దిశగా అడుగులు ఏమైనా వేస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



