Home

»

Latest News

సినిమా చూస్తు ఆ పని చేస్తున్నవ్యక్తి: సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం!

Oct 14, 2026 5:18PM


సినిమా... ఇచ్చే ఆనందాన్ని మాటల్లో వర్ణించంలేం. అందుకే కాబోలు హైదరాబాద్‌లో ఒక ఆటో నడిపే వ్యక్తి  ఆ ఆనందాన్ని ఒక్క నిమిషం కూడా దూరం చేసుకోకూడదని బావించాడేమో ఏమో, ప్రయాణికుల భద్రత ముఖ్యమనే విషయాన్నీ గాలికి వదిలేసాడు. మరి పూర్తి మ్యాటర్  ఏంటో చూద్దాం.


ప్రయాణికులని  సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన ఒక ఆటో డ్రైవర్, ఏకంగా ఆటోని  మొబైల్ థియేటర్‌లా మార్చుకుని చేసిన సాహసం అందరినీ షాక్‌కు గురిచేసింది. రద్దీగా ఉండే నగర రోడ్లపై ఆటో నడుపుతూనే, ఆ డ్రైవర్ చేసిన విపరీతమైన మల్టీటాస్కింగ్ చూసి పోలీసులు సైతం విస్మయం వ్యక్తం చేశారు.

వైరల్ అవుతున్న ఆ వీడియో వివరాల ప్రకారం, టీజీ15యూ2657 (TG15U2657) నంబరు గల ఆటో రిక్షాను నడుపుతున్న డ్రైవర్ తన ముందు భాగంలో ఏకంగా రెండు మొబైల్ ఫోన్లను అమర్చుకున్నాడు. అందులో ఒక ఫోన్‌లో గమ్యస్థానాన్ని సూచించే నావిగేషన్ రూట్ రన్ అవుతుండగా, మరొక మొబైల్‌లో సినిమా చూస్తూ డ్రైవింగ్ చేశాడు. అంతటితో ఆగకుండా చెవులకు రంగురంగుల లైట్లు వెలిగే పెద్ద హెడ్‌ఫోన్లను తగిలించుకుని బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా బ్యాలెన్స్ తప్పుతూ వాహనం నడిపాడు. ఆటోలో ప్రయాణికులు కూర్చుని ఉన్నప్పటికీ, వారి ప్రాణాలను లెక్కచేయకుండా డ్రైవర్ ఇలా సినిమా చూడటం తీవ్ర విమర్శలకు దారితీసింది.


ఇది కూడా చదవండి: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన వారణాసి: హాలీవుడ్ దిగ్గజాలే షాక్! 

ఈ ప్రమాదకరమైన వీడియో నెట్టింట వైరల్ కావడంతో  హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఆటో డ్రైవర్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదని,ప్రయాణికుల మరియు తోటి రోడ్డు వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని హెచ్చరించారు. వెంటనే స్పందించిన ఆయన, ఆటో నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించి మోటార్ వాహన చట్టం (MV Act) కింద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.

 

 

 

కాబట్టి డియర్ ఆటో డ్రైవర్స్ సినిమా చూస్తే వచ్చే అసలైన సినీ మజా ఎప్పుడు  వస్తుందంటే పనులన్నీ ముగించుకొని ప్రశాంతంగా ఒక చోటు కూర్చొని... 

 

[Sajjanar Warns Auto Driver Hyderabad, Tollywood news, Telugu Cinema News, Latest Telugu Film News, TeluguOne Cinema News,Telugu One, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 


     

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com