Home

»

Latest News

అల్లు అర్జున్ రాకా మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఎవ‌రో తెలుసా?

Apr 22, 2026

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక కొత్త పేరు మారుమోగిపోతోంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ చిత్రం 'రాకా' (Raaka) కు సంగీతం అందించే ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు సాయి అభ్యంకర్. ప్రముఖ సంగీత దర్శకులు అనిరుధ్, జీవీ ప్రకాష్ తరహాలోనే చిన్న వయసులోనే తనదైన ముద్ర వేసేందుకు ఈ కుర్రాడు సిద్ధమవుతున్నాడు.

సాయి అభ్యంకర్ మరెవరో కాదు, టాలీవుడ్ పాపులర్ సింగర్స్ టిప్పు, హరిణిల కుమారుడు. తల్లిదండ్రుల నుంచి అబ్బిన సంగీత జ్ఞానంతో ఆరో తరగతి నుంచే ట్యూన్స్ కంపోజ్ చేయడం ప్రారంభించాడు. స్కూల్ ఏజ్‌లో పిల్లలు ఆటపాటల్లో మునిగిపోతే, సాయి మాత్రం సరికొత్త మెలోడీలను సృష్టించడంలో బిజీగా ఉండేవాడట.

తాజా ఇంటర్వ్యూలో సాయి ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. తన వద్ద ఇప్పటికే దాదాపు వెయ్యికి పైగా కొత్త ట్యూన్స్ సిద్ధంగా ఉన్నాయని తెలిపాడు. అయితే 'రాకా' సినిమా కోసం ఆ పాత ట్యూన్స్‌ను వాడకుండా, అట్లీ విజన్ కు తగ్గట్టుగా పూర్తిగా కొత్త బాణీలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించాడు. ఆ వెయ్యి పాటల నిధిని తన రిటైర్మెంట్ వయసులో వాడుకుంటానని సరదాగా వ్యాఖ్యానించాడు.

గతంలో 'డ్యూడ్' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సాయి, ఇప్పుడు బన్నీ సినిమాతో గ్లోబల్ లెవల్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పాటల కోసం ఇంటర్నేషనల్ సింగర్స్‌ను రంగంలోకి దించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఎనర్జీకి, అట్లీ మేకింగ్‌కు తోడు సాయి అభ్యంకర్ మ్యూజిక్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి తెగ చర్చ జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాల్లో మ్యూజిక్ పట్ల చాలా కేర్ తీసుకుంటారు, అలాంటిది సాయికి అవకాశం ఇచ్చారంటే అందులో గట్టి విషయమే ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com