Home

»

Latest News

MRP Teaser: ముగ్గురు యువకుల అల్లరి.. మరో జాతిరత్నాలు అవుతుందా?

Apr 22, 2026 1:20PM

'ఎంఆర్‌పీ' సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల కావడం విశేషం. టీజర్ విడుదల చేసిన అనంతరం టీం అందరికి విషెస్ చెప్తూ మూవీ సక్సెస్ కావాలని అన్నారు. (MRP Movie)

పాంచజన్య ఫీచర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ టీజర్ చూస్తే వినోదంతో నిండిన వినూత్న కథను చూపించబోతుందనే భావన కలుగుతోంది. ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే కథ, వారి మధ్య ఉండే సరదా సంఘటనలు, స్టైలిష్ మేకింగ్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఈ చిత్రానికి శ్రవణ్ జేష్ఠ దర్శకత్వం వహిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. టీజర్‌లో కనిపించిన ఎనర్జీ, ప్రెజెంటేషన్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

సంగీతాన్ని అజయ్ అరసాడ  అందించగా, విజువల్స్‌కి మరింత ఆకర్షణను తీసుకొచ్చింది. టెక్నికల్ టీమ్ పని కూడా ప్రశంసనీయంగా కనిపిస్తోంది.

టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. వినోదంతో పాటు కొత్తదనం చూపించబోతున్న 'ఎంఆర్‌పీ' సినిమా నుంచి త్వరలో మరిన్ని విశేషాలు తెలియనున్నాయి.

ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, సుదర్శన్, డొనాల్ బిష్త్, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, గగన్ విహారి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com