Home

»

Latest News

రోమాంచకం ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. టాక్ పరిస్థితి అయితే ఇదే!

Sep 5, 2026 11:05AM


సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ "రోమాంచకం" నిన్న థియేటర్స్ లో అడుగుపెట్టింది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి ఒక నిర్మాతగా ఉండటంతో ప్రమోషన్స్ నుంచే ప్రేక్షకుల దృష్టి 'రొమాంచకం' పై పడింది. కంటెంట్ మంచిదే అయినా లో బడ్జెట్ తో తెరకెక్కడం మైనస్ అని, ఎంటర్ టైన్ మెంట్  ఒక మాదిరిగా వర్క్ అవుట్ అయ్యిందనే మాట ప్రేక్షకుల నుంచి వినపడుతుంది. 

 ఈ చిత్రం తొలి రోజున 1.75 కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా తెలుస్తుంది.  నెట్ కలెక్షన్‌ దాదాపు 1.50 కోట్ల రూపాయలు. మొదటి రోజు థియేటర్లలో ఓవరాల్ ఆక్యుపెన్సీ 29.0 శాతంగా నమోదైంది. షోల వారీగా ఆక్యుపెన్సీ వివరాలను పరిశీలిస్తే, ఉదయం షోల నుంచి రాత్రి షోలకు వెళ్లేకొద్దీ ఆడియన్స్ కౌంట్ పెరగడం శుభసూచికం. మార్నింగ్ షోలు 19.69 శాతం ఆక్యుపెన్సీతో మొదలవ్వగా, ఆఫ్టర్‌నూన్ షోలు 26.31 శాతానికి పెరిగాయి. ఇక ఈవినింగ్ షోలు 21.31 శాతం నమోదు కాగా, నైట్ షోలలో అత్యధికంగా 37.38 శాతం ఆక్యుపెన్సీ చూపించింది.


Also Read:  రొమాంచకం మూవీ రివ్యూ 

 

 

తొలి రోజు గ్రాస్‌లో దాదాపు 1.65 కోట్ల రూపాయలు కేవలం ఎపి అండ్ తెలంగాణ నుంచే వసూలయ్యాయి.  సుమంత్ ప్రభాస్, అనంతికలతో పాటు ఉపేంద్ర లిమాయే, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్ వంటి నటులు తమ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులని  నవ్వించడంలో కీ రోల్  పోషించారు.

  

 

[Romanchakam, Romanchakam Movie Review, Romanchakam Collections,  Ananthika Sanil Kumar, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood ]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com