
కామెడీ కింగ్ 'అల్లరి నరేష్' మరోసారి తనదైన కామెడీ మార్కు తో నిన్న' రంభ ఊర్వశి మేనక' తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. అల్లరి నరేష్ తో పాటు ఆల్ ఆర్టిస్ట్స్ తమ పెర్ఫార్మ్ తో మెప్పించారు. కానీ అవుట్ డేటెడ్ సబ్జెక్టు, సీన్స్, డైరెక్షన్ తో మెప్పించలేకపోయిందనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతుంది. రివర్స్ స్క్రీన్ ప్లే, తో పాటు ఇదే సబ్జెక్టు ని సిటీ నేపథ్యంలో, డిఫరెంట్ మోడ్ ఫొటోగ్రఫీ కనుక ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే మాటలు సినీ సర్కిల్స్ లో సైతం వినపడుతున్నాయి.
ట్రేడ్ వర్గాల అంచనా వివరాల ప్రకారం తొలి రోజు 1.01 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఈ లెక్కన నెట్ కలెక్షన్స్ దాదాపు 0.75 కోట్లు. దేశవ్యాప్తంగా 227 నగరాల్లో 452 థియేటర్లలో, దాదాపు 1,189 షోల ద్వారా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. తొలిరోజు మొత్తం 79,839 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. రోజువారీ సగటు ఆక్యుపెన్సీ 19.9 శాతంగా నమోదైంది. మొదటి రోజే 90 థియేటర్లలో ఫాస్ట్ ఫిల్లింగ్ షోలు పడగా, 2 షోలు పూర్తిగా హౌస్‌ఫుల్ అయ్యాయి. ప్రాంతాల వారీగా వసూళ్లను పరిశీలిస్తే, తెలంగాణలో అత్యధికంగా 36.77 లక్షల గ్రాస్ రాబట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో హైదరాబాద్ నగరం నుంచే అత్యధికంగా 19.65 లక్షల గ్రాస్ కలెక్షన్స్ రావడం విశేషం. ఆంధ్రా రీజియన్‌లో విశాఖపట్నం (వైజాగ్) లో 7.04 లక్షలు, విజయవాడలో 3.43 లక్షల కలెక్షన్లు వచ్చాయి.
Also Read: Ramba Oorvasi Menaka: రంభ, ఊర్వశి, మేనక మూవీ రివ్యూ

షో టైమ్స్ ప్రకారం చూస్తే మధ్యాహ్నం, సాయంత్రం షోలకు అత్యధికంగా ప్రేక్షకులు వచ్చారు. మధ్యాహ్నం షోల ద్వారా 25.70 లక్షలు, సాయంత్రం షోల ద్వారా 25.88 లక్షలు కలెక్ట్ అయ్యాయి. మరి వీకెండ్ లో ఎంత మేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. ,కామెడీ టైమింగ్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి.
చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాల ప్రసాద్ సంయుక్తంగా నిర్మించగా సీనియర్ నరేష్, సురభి, రాశీ సింగ్, విష్ణుప్రియ, వెన్నెల కిషోర్, ప్రిషా సింగ్, వెన్నెల కిషోర్ కీ రోల్స్ పోషించారు.చైతన్ భరద్వాజ్ మ్యూజిక్. మాస్ సెంటర్లు, ఫ్యామిలీ ఆడియన్స్ గనుక థియేటర్లకు క్యూ కడితే ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశ్రమ వర్గాల టాక్.
[Ramba Oorvasi Menaka, Allari Naresh, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]





