
స్టార్ హీరోల కట్ అవుట్ కి ధీటుగా రెండు దశాబ్దాల పై నుంచి స్టార్ డమ్ తో దూసుకుపోతన్న భామ నయనతార.చెక్కుచెదరని గ్లామర్, ఫిట్‌నెస్‌తో మిలియన్ల కొద్దీ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. రీసెంట్ గా మాల్దీవుల వెకేషన్‌లో సముద్ర తీరాన దిగిన కొన్ని గ్లామరస్ చిత్రాలని నయనతార తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.
వైట్ క్రాప్‌డ్ టాప్, షీర్ ర్యాప్ స్కర్ట్‌తో కూడిన ఈ టూ పీస్ అవుట్‌ఫిట్ ఫొటోలు సోషల్ మీడియాను ఒక్కసారిగా ఊపేసాయి. సముద్రం, ఆకాశం అందమైన బ్యాక్‌డ్రాప్‌గా ఉండగా, 'Orange Flavored Cigarettes'అనే పాటకు ట్యూన్ చేస్తూ ఆమె ఈ పిక్స్‌ని పోస్ట్ చేశారు. అయితే, ఈ ఫొటోలకు నయన్ ఉపయోగించిన ఆర్టిస్టిక్ సాఫ్ట్ ఫోకస్, మోషన్ బ్లర్ ఎఫెక్ట్ నెటిజన్ల మధ్య ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. ఈ చిత్రాల్లో డబుల్ ఎక్స్‌పోజర్ మరియు మూవ్‌మెంట్ షాడోస్ కారణంగా ఫొటోస్ కొద్దిగా బ్లర్‌గా కనిపించాయి. దీంతో అభిమానులకు నయన్ అందాలను స్పష్టంగా చూడలేకపోయామనే చిన్న నిరాశ ఎదురైంది.
ఇది కూడా చదవండి: రష్మిక నటిస్తుందా!.. వైరల్ మారిన న్యూస్
.webp)
కానీ ఈ డిజిటల్ యుగంలో నెటిజన్లు ఊరికే ఉంటారా? నయనతార అందాన్ని స్పష్టంగా చూడాలనే కుతూహలంతో వినూత్నంగా ఆలోచించారు. వెంటనే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎడిటింగ్ టూల్స్, డినోయిజింగ్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించారు. ఆ ఫొటోలలో ఉన్న మోషన్ బ్లర్‌ను తొలగించి, హెచ్‌డీ (HD) క్వాలిటీతో క్లియర్ వెర్షన్లను తయారు చేశారు. ఆపై ఆ క్లియర్ ఎడిటెడ్ పిక్స్‌ను ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయడం ప్రారంభించారు.
[Nayanthara Blurry Beach Photos Viral, Nayanthara, Nayanthara Beach Photos, Nayanthara Viral Pics, Nayanthara AI Edits, Nayanthara Blurry Photos., TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]




