Home

»

Latest News

రవితేజ ‘RT-78’ టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది.. ‘తులాభారం’తో కొత్త ప్రయోగం!

Oct 11, 2026 3:01PM

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ‘ఇరుముడి’తో విజయాన్ని అందుకున్న ఆయన.. ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తన 78వ సినిమా చేస్తున్నారు. ‘RT-78’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి తాజాగా ‘తులాభారం’ అనే పేరును ఖరారు చేశారు. హైదరాబాద్‌లో సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, టైటిల్‌ను పరిచయం చేస్తూ విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఈ టైటిల్ గ్లింప్స్‌లో సినిమా పేరును నిర్ణయించే క్రమాన్ని సరదాగా చూపించారు. రవితేజ ‘లైట్స్ ఆన్’ అంటూ సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వగా, తరుణ్ భాస్కర్ ఇది పొలిటికల్ డ్రామా కాబట్టి ‘రాజ్‌నీతి’ అని పేరు పెడదామని సూచిస్తారు. అయితే, రవితేజ తనదైన శైలిలో స్పందించడంతో అక్కడి నుంచి టైటిల్ చర్చ మరింత వినోదాత్మకంగా సాగుతుంది. ఇది భార్య కోసం తపించే భర్త కథ అని, లవ్ స్టోరీ అని చెప్పడంతో ప్రియాంక మోహన్, జేడీ చక్రవర్తి, అనస్వర రాజన్ తదితరులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. చివరికి అన్ని అంశాలను సమతూకం చేస్తూ ‘తులాభారం’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు గ్లింప్స్‌లో చూపించారు.

ఇక ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ కథానాయికలుగా నటిస్తుండగా, జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిల్ కరెల్లా, ఇతర నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీని రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా పూజా కార్యక్రమానికి యువ హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు.

విభిన్నమైన కథాంశాలు, కామెడీ, ఎమోషన్స్‌ను కలిపి సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా వివేక్ ఆత్రేయకు గుర్తింపు ఉంది. మరోవైపు మాస్ ఇమేజ్ ఉన్న రవితేజతో ఆయన జతకట్టడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. టైటిల్ గ్లింప్స్‌తోనే కథలోని విభిన్న కోణాలను సరదాగా పరిచయం చేసిన మేకర్స్.. మున్ముందు విడుదల చేసే అప్డేట్స్‌తో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతారేమో చూడాలి.

 

 

[Ravi Teja, Thulabharam Movie, RT78 Movie, Ravi Teja 78th Film, Vivek Athreya, Priyanka Mohan, Anaswara Rajan, JD Chakravarthy, Thulabharam Title Glimpse]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com