Home

»

Latest News

జై కొడుతున్న ఫ్యాన్స్:  రవితేజకి ఆ పేరు వచ్చింది చిరంజీవి వలనే అని తెలుసా!

Sep 2, 2026 4:35PM

 

 

మాస్ మహారాజా రవితేజ.. ఈ పేరు వినడం ఆలస్యం అభిమానులు, ప్రేక్షకులు పోటీ పడి మరి రవితేజ మేనరిజమ్స్, డైలాగ్స్ తో రెచ్చిపోతారు. ప్రస్తుతం ఇరుముడితో సందడి చేస్తూ 200 కోట్ల క్లబ్ లోకి చేరాడు. పైగా ఎంటైర్ తన కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్. ఈ క్రమంలో రవితేజకి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంది.  ఈ క్రమంలో తాజాగా హల్ చల్ చేస్తున్న న్యూస్ ఏంటో చూద్దాం


రవితేజ అసలు పేరు 'భూపతిరాజు రవిశంకర్ రాజు'  ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించిన రవిశంకర్ రాజు. చదువు పూర్తి చేసిన తర్వాత సినిమాలపై ఉన్న  ఆసక్తితో చెన్నై బాట పట్టారు. 1980వ దశకంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూనే, తెరపై కనిపించడానికి చిన్న చిన్న అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ 'దొంగ మొగుడు' కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. 


Also Read: 270 సినిమాల్లో 180 ఫ్లాపులు:చివరికి 350 కోట్ల బ్లాక్‌బస్టర్‌తో అదరగొట్టిన మీ లెజెండరీ హీరో

చిత్రీకరణ సమయంలో  రాఘవేంద్రరావు గారు రవితేజలోని  ఉత్సాహాన్ని, నటన పట్ల ఉన్న అంకితభావాన్ని గమనించారు. ఒక రోజు షూటింగ్ గ్యాప్‌లో రవితేజని  రాఘవేంద్రరావు పిలిచి, "నీ పేరులో ఎంతో శక్తి ఉంది, కానీ స్క్రీన్ నేమ్ చాలా షార్ప్‌గా, క్యాచీగా ఉండాలి. పైగా నీ పేరుని పిలవాలన్నా ఇబ్బందిగా ఉందని 'రవి' అనే పదం నుంచి 'రవి', దానికి 'తేజస్సు' లేదా 'కాంతి' అనే అర్థం వచ్చేలా 'తేజ' అనే పదాన్ని కలిపి 'రవితేజ' అనే పేరుని ఫిక్స్ చేసారు.  అలా 'దొంగ మొగుడు' చిత్ర సెట్స్‌పైనే రవిశంకర్ రాజుకు 'రవితేజ' అనే నామకరణం జరిగింది. దొంగమొగుడులో చిరంజీవి డ్యూయల్ రోల్ పోషించగా ఒక క్యారక్టర్ పేరు రవితేజ..అందుకే రాఘవేంద్ర రావు గారు  రవితేజ అని రవితేజకి నిర్ణయించారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 1987 లో విడుదలైన దొంగమొగుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ తో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

 

 

[ Ravi Teja, Donga Mogudu, Chiranjeevi, Irmudi, Telugu Cinema, Telugu Cinema News, Tollywood]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com