.webp)
కామెడీ కింగ్ అల్లరి నరేష్, హీరోయిన్లు సురభి, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త ఫాంటసీ ఎంటర్‌టైనర్ 'రంభ ఊర్వశి మేనక'. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
కథ విషయానికి వస్తే... రాజమండ్రికి చెందిన తండ్రీ కొడుకులుగా వి.కె. నరేష్, అల్లరి నరేష్ కనిపిస్తారు. వీరి వద్ద వంశపారంపర్యంగా ఒక మ్యాజిక్ బుక్ ఉంటుంది. దానిపై సరిగ్గా ముగ్గు వేస్తే రంభ, ఊర్వశి, మేనక అనే దేవకన్యలు భూమిపైకి వస్తారని తండ్రి చెబుతాడు. దాంతో హీరో ఏకంగా 25 ఏళ్ల పాటు కష్టపడి ఆ ముగ్గు ప్రయత్నం ఫలించేలా చేసి, దేవకన్యలైన రంభ (రాశీ సింగ్), ఊర్వశి (విష్ణుప్రియ), మేనక (ప్రిషా సింగ్)లను భూమిపైకి రప్పిస్తాడు. అలా ఇంద్రలోకం నుంచి వచ్చిన దేవకన్యల వల్ల భూమిపై ఎలాంటి వినోదం పండింది? హీరో వారి నుంచి ఏం కోరుకున్నాడు? అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం.

సెన్సార్ స్క్రీనింగ్ సమయంలో మొదట ఈ సినిమా టైటిల్‌పై, అలాగే కొన్ని సన్నివేశాలపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు వ్యక్తపరిచింది. టైటిల్ మార్చాలని కూడా సూచించారు. అయితే చిత్ర యూనిట్ కథ యొక్క ఆవశ్యకతను సెన్సార్ బోర్డు సభ్యులకు పక్కాగా వివరిస్తూ వారిని ఒప్పించగలిగింది. కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి UA16+ సర్టిఫికెట్ ఇచ్చి రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక ఈ సినిమా రన్‌టైమ్ విషయానికి వస్తే, ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను ఎంతో ఫన్‌గా, గ్రిప్పింగ్‌గా చెప్పడానికి 2 గంటల 20 నిమిషాలు (140 నిమిషాలు) రన్‌టైమ్‌ను లాక్ చేశారు.
అల్లరి నరేష్, వి.కె. నరేష్ మధ్య వచ్చే కామెడీ సీన్లు, ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ చేసిన హంగామా, భామల గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని సెన్సార్ టాక్ చెప్తోంది. పెద్దగా బుర్రకు పనిచెప్పకుండా థియేటర్‌లో ప్రశాంతంగా కూర్చుని హ్యాపీగా నవ్వుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బావుందట. కామెడీతో పాటు ఎమోషన్ కూడా బాగా పండింది అంటున్నారు.
[Rambha Urvasi Menaka, Movie Review, Allari Naresh, Vishnu Priya, Raashi Singh, Telugu Film News, Telugu News]





.webp)
