TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

వర్మ దర్శకత్వంలో మరో నగ్న చిత్రమ్

May 14, 2020 12:22PM

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. అప్పుడప్పుడూ తీవ్ర వివాదాలకూ ఆయన చేసే పనులు నెలవుగా మారుతుంటాయి. అటువంటి వివాదాల్లో 'జీఎస్టీ' ఒకటి. ఇదేదో పన్నుకు సంబంధించిన వివాదం అనుకునేరు. నగ్న చిత్రమ్ చుట్టూ తిరిగిన వివాదం. పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన తారగా 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' అని వర్మ  ఒక నగ్న లఘు చిత్రమ్ తీశారు. అప్పట్లో మహిళా సంఘాలు ఆయన మీద విరుచుకుపడ్డాయి. అయితే ఆయన పట్టించుకోలేదు అనుకోండి.

లేటెస్టుగా అదే మియా మాల్కోవాతో మరో చిత్రమ్ తీసినట్టు వర్మ ప్రకటించారు. బహుశా... ఇదీ నగ్న లఘు చిత్రమ్ అయి ఉంటుందని ఊహిస్తున్నారంతా. ఈ చిత్రం టైటిల్ 'క్లైమాక్స్'. గురువారం సాయంత్రం ఐదు గంటలకు టీజర్ విడుదల చేస్తున్నట్టు వర్మ తెలిపారు. "కరోనా పెట్టిన శాపాలు, లాక్ డౌన్ ఆశీర్వాదాలతో మియా మాల్కోవా, నేను 'క్లైమాక్స్' టీజర్ రిలీజ్ చేస్తున్నాం. త్వరలో డీటెయిల్స్ విడుదల చేస్తా" అని వర్మ ట్వీట్ చేశారు.

google-ad-img