
‘రామాయణ’ సినిమా ప్రమోషన్స్‌లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి రెండో ట్రైలర్‌ను బెంగళూరులో విడుదల చేయనున్నట్లు సమాచారం. అక్టోబర్ 15న ఈ కార్యక్రమం జరగనుంది. యశ్ ఇప్పటికే చిత్రబృందంతో కలిసి బెంగళూరుకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
నితీశ్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలో తొలి ట్రైలర్‌ను పరిచయం చేసిన చిత్రబృందం.. ఇప్పుడు రెండో ట్రైలర్ ఈవెంట్‌ను బెంగళూరులో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కర్ణాటకలో యశ్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘కేజీఎఫ్’ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు రావణుడి పాత్రలో కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

‘రామాయణ’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా రావణుడి పాత్రలో యశ్ లుక్, భారీ యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది. రెండో ట్రైలర్లో కథకు సంబంధించిన మరిన్ని అంశాలను చూపిస్తారా? యశ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: RC17 కోసం కీలక అడుగు.. రామ్ చరణ్, సుకుమార్ ప్లాన్ ఇదేనా.?
[Ramayana Trailer 2, Ramayana Bengaluru Event, Ramayana Movie, Yash, Ranbir Kapoor, Sai Pallavi, Nitesh Tiwari, Telugu Film News]





