Home

»

Latest News

RC17 కోసం కీలక అడుగు: రామ్ చరణ్, సుకుమార్ ప్లాన్ ఇదేనా.?

Oct 14, 2026 12:52PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా, చరణ్ కెరీర్‌లోనే ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో మరోసారి సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా కీలక అడుగు పడింది. హైదరాబాద్‌లో RC17 ప్రొడక్షన్ ఆఫీస్‌ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఆఫీస్ ప్రారంభం కావడంతో సినిమా పనులు అధికారికంగా ముందుకు కదులుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌పై టీమ్ దృష్టి పెట్టినట్లు సమాచారం. డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మూవీ లాంచ్ కార్యక్రమాన్ని కూడా విజయదశమి సందర్భంగా అక్టోబర్ 20 ప్రాంతంలో నిర్వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

‘రంగస్థలం’లో చిట్టిబాబుగా రామ్ చరణ్ చూపించిన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సుకుమార్ తనదైన కథనం, పాత్రల రూపకల్పనతో ఆ సినిమాను ప్రత్యేకంగా నిలిపారు. ఇప్పుడు వీరిద్దరూ మళ్లీ కలుస్తుండటంతో RC17పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కోసం చరణ్ ఫిజికల్‌గా కూడా సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన లుక్, కథా నేపథ్యం చాలా కొత్తగా ఉండబోతున్నట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: విజయ్‌ను చూసి భయపడ్డా.. రణబాలి ఈవెంట్‌లో రష్మిక కామెంట్స్.!

 

 

 

[RC17 Office Opening, RC17 Movie Launch, Ram Charan Sukumar Movie, Rangasthalam Combo, RC17 Movie, Ram Charan, Sukumar, Mythri Movie Makers, Telugu Film News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com