Home

»

Latest News

'రామాయణ' నిర్మాతపై దాడి.. ఖచ్చితంగా ఇది ఆ సంస్థ పనే!

Oct 8, 2026 11:44AM

 

భారతీయ సినీ ప్రేమికులు, రామ భక్తులు ఎంతో ఎగ్జైట్ గా ఎదురుచూస్తున్న మూవీ రామాయణ. ఆ రాముడి చరిత్రని భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌గా తీర్చి దిద్ది వరల్డ్ సినిమాని ఇండియన్ సినిమా వైపు చూసేలా చేస్తున్నారు నిర్మాత  నమిత్ మల్హోత్రా. ఇప్పుడు ఆ నిర్మాతపై జరుగుతున్న ఐటి దాడులు సినీ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది


నమిత్ కి చెందిన ప్రసిద్ధ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్  ముంబై కార్యాలయాలు, స్టూడియోలతో పాటు ఆయన నివాసంపై ఐటీ అధికారులు హఠాత్తుగా సోదాలు నిర్వహించారు. ఐటీ శాఖ నిర్వహించిన ఈ తనిఖీలు కేవలం నమిత్ మల్హోత్రా ప్రధాన కార్యాలయానికే పరిమితం కాలేదు. ప్రైమ్ ఫోకస్ కంపెనీకి సంబంధించిన ఆడిటర్లు, ఆర్థిక సలహాదారులు, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ల (CA) నివాసాలు మరియు కార్యాలయాలపై కూడా అధికారులు సమాంతరంగా రైడ్స్ నిర్వహించారు.విదేశీ మారక ద్రవ్య నిధుల బదిలీలు,సరిహద్దులు దాటి జరిగిన భారీ విదేశీ నిధుల లావాదేవీల్లో అక్రమాలు జరిగాయనే అనుమానంతోనే ఈ సోదాలు చేపట్టినట్లు ప్రాథమిక సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో సుమారు 16,000 కోట్ల నికర ఆస్తి విలువ కలిగిన అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తగా పేరుగాంచిన నమిత్ మల్హోత్రా విదేశీ అనుబంధ సంస్థల నుండి చేపట్టిన నిధుల బదిలీ విధానాలపై పన్ను నిపుణులు నిశితంగా దృష్టి సారించారు.


ఇది కూడా చదవండి: నానా పటేకర్ మృతిపై ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్!

 

ఈ ఐటీ దాడుల వార్తలు మీడియాలో దావానలంలా వ్యాపించడంతో దాని ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపించింది. ముంబై షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్ కంపెనీ షేర్ల విలువ దాదాపు 8 శాతం మేర దారుణంగా పడిపోయింది. ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొనడంతో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి ఒక్కసారిగా పెరిగింది. కాగా, ఈ సోదాలపై ప్రైమ్ ఫోకస్ యాజమాన్యం స్పందిస్తూ, తాము ఐటీ అధికారుల విచారణకు సంపూర్ణంగా సహకరిస్తున్నామని, తమ వ్యాపార కార్యకలాపాలు ఎప్పటిలాగే సజావుగా సాగుతున్నాయని స్పష్టం చేసింది. మరోవైపు ఐటీ శాఖ కూడా ఈ విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, పన్ను ఎగవేత లేదా ఆర్థిక అక్రమాలు జరిగాయని ఇంకా అధికారికంగా నిర్ధారించలేదని ప్రకటించింది.


రామాయణ మొత్తం రెండు భాగాలు కలిపి దాదాపు 4000 కోట్ల బడ్జెట్. దంగల్ దర్శకుడు. నితీష్ తివారి తెరకెక్కించగా రాముడుగా రణబీర్ కపూర్, సీతమ్మవారు గా సాయి పల్లవి, రావణుడుగా యష్ ఎలా మెస్మరైజ్ చేయబోతున్నారనే ఆసక్తి అభిమానులతో పాటు అందరిలో ఉంది.  

 

[Ramayana Producer Namit Malhotra Faces It Raid, Ramayana movie producer, Namit Malhotra IT raids, Prime Focus Mumbai, Ranbir Kapoor Ramayana, Telugu Cinema, TeluguNews, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com