
రామాయణ పార్ట్ 1 ద్వారా రాముడు ఎక్కుబెట్టిన విల్లు రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తెల్లోల్ల అడ్డా ఓవర్ సీస్ లోను అదే పరిస్థితి. దీంతో అతి తక్కువ వ్యవధిలోనే ఓవర్ సీస్ చరిత్రలో అనేక రికార్డ్స్ జై శ్రీరామ్ అంటున్నాయి.
కేవలం 11 రోజుల్లోనే ఫేజ్-1 (Phase 1) ఓవర్సీస్ కలెక్షన్లలో 50 మిలియన్ డాలర్ల మైలురాయిని దాటి, ఇప్పటివరకు ఉన్న అన్ని భారతీయ చిత్రాల రికార్డులు 'ధురంధర్ 2' (50 మిలియన్ డాలర్లు), 'పఠాన్' (49.30 మిలియన్ డాలర్లు), 'జవాన్' (48 మిలియన్ డాలర్లు), 'బాహుబలి 2' (46.98 మిలియన్ డాలర్లు) నెలకొల్పిన ఫేజ్-1 లైఫ్ టైమ్ రికార్డులని 11 రోజుల్లోనే అధిగమించడం విశేషం.
12 రోజులు ముగిసేసరికి ఈ సినిమా మొత్తం ఓవర్సీస్ వసూళ్లు 51.75 మిలియన్ డాలర్లకు, అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 490 కోట్ల రూపాయల గ్రాస్‌కి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో వచ్చిన 1,437.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లలో, ఒక్క ఓవర్సీస్ మార్కెట్ నుంచే 34.1 శాతం వాటా రావడం ఈ సినిమా గ్లోబల్ క్రేజ్‌కు నిదర్శనం.

విదేశీ మార్కెట్లలో నార్త్ అమెరికా (అమెరికా, కెనడా) 'రామాయణం' చిత్రానికి అతిపెద్ద వసూళ్ల కేంద్రంగా నిలిచింది. అక్కడ 11 రోజుల్లోనే ఏకంగా 24 మిలియన్ డాలర్లు వసూలు చేసి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.యూకే, ఐర్లాండ్ దేశాల్లో 5.55 మిలియన్ డాలర్లు (4.20 మిలియన్ పౌండ్లు) సాధించి, యూకే బాక్సాఫీస్ వద్ద 4 మిలియన్ పౌండ్ల మార్కును దాటిన మూడో భారతీయ చిత్రంగా చరిత్రకెక్కింది.
ఇది కూడా చదవండి: సంచలనం నమోదు: రిలీజ్‌కి ముందే 11,000 కోట్లు కొల్లగొట్టేసింది!
అలాగే గల్ఫ్ దేశాల్లో 5.40 మిలియన్ డాలర్లు, ఆస్ట్రేలియాలో 4.20 మిలియన్ డాలర్లు, యూరప్ దేశాల్లో 2.5 మిలియన్ డాలర్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కేవలం పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా, రామాయణ ఇతిహాసంతో విడదీయరాని అనుబంధం ఉన్న ఆసియా దేశాల్లో కూడా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.
మలేషియాలో 900 వేల డాలర్లు, సింగపూర్‌లో 790 వేల డాలర్లు, ఇండోనేషియాలో 575 వేల డాలర్లు, వియత్నాంలో 565 వేల డాలర్లు, న్యూజిలాండ్‌లో 525 వేల డాలర్లు వసూలు చేసి అక్కడి భారతీయ చిత్రాల ఆల్-టైమ్ రికార్డులను తిరగరాసింది. పొరుగు దేశమైన నేపాల్‌లో అయితే కేవలం 8 రోజుల్లోనే 4 లక్షల 6 వేలకు పైగా టికెట్లు అమ్ముడై 16.10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి 'ఆర్ఆర్ఆర్', 'పఠాన్', 'జవాన్' వంటి చిత్రాలను దాటేసింది.భారతదేశంలో 12 రోజుల్లో 947.25 కోట్ల రూపాయల గ్రాస్ (792 కోట్ల నెట్) వసూలు చేసిన 'రామాయణం', ఓవర్సీస్ కలెక్షన్ల అండతో అత్యంత వేగంగా 1,400 కోట్ల క్లబ్‌లో చేరిన భారతీయ చిత్రంగా నిలిచింది.
.webp)
చైనా, జపాన్ వంటి ఫేజ్-2 మార్కెట్లలో ఇంకా విడుదల కాకముందే ఈ స్థాయిలో 51 మిలియన్ డాలర్లకు పైగా ఓవర్సీస్ వసూళ్లు సాధించడంతో, రాబోయే రోజుల్లో ఈ చిత్రం 2,000 కోట్ల మైలురాయిని కూడా సునాయాసంగా దాటుతుందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మీకు నచ్చవచ్చు:ప్రముఖ హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్: అక్కినేని కోడళ్ల గురించేనా చెప్పింది!
మీకు నచ్చవచ్చు: కొత్త లోక రికార్డుకి మన తెలుగు హీరోయిన్ మంగళగీతం పాడనుందా!
[Ramayana, Ranbir Kapoor, Yash, Sai Pallavi, Nitesh TIwari, Namith Malhotra]






