Home

»

Latest News

Ramayana: రామాయణ థియేట్రికల్ హక్కుల రేటు చూసి షాక్ అవుతున్న స్టార్ డిస్ట్రిబ్యూటర్స్

May 22, 2026


అయోధ్య రాముడి జీవిత కథ సెల్యులాయిడ్ పై మరోమారు 'రామాయణ'(Ramayana)మూవీ ద్వారా సాక్షాత్కారం కాబోతుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ యొక్క గొప్ప తనాన్ని ప్రపంచసినిమాకి కూడా రామాయణ ద్వారా మేకర్స్ తెలియచెప్పనున్నారు. సుమారు 4000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో  రెండు భాగాలుగా తెరకెక్కనుండగా మొదటి భాగం దీపావళి కానుకగా నవంబర్ 8 న విడుదల కానుంది. 

రామాయణ  యొక్క థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ హక్కుల బిజినెస్ వ్యవహారాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, కేవలం హిందీ థియేట్రికల్ పంపిణీ హక్కుల కోసమే నిర్మాత నమిత్ మల్హోత్రా(Namith Malhotra) 450 కోట్ల రూపాయల భారీ ధరని చెప్తునట్టుగా తెలుస్తోంది. భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సింగిల్ రీజియన్ థియేట్రికల్ రైట్స్ కోసం ఇంత పెద్ద మొత్తం అడగడం ఇదే తొలిసారి కావడంతో  ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్మ్స్, వంటి దేశంలోని టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌లు మరియు అనిల్ తడాని, జయంతిలాల్ గడ వంటి స్టార్ డిస్ట్రిబ్యూటర్లు  షాక్‌కి గురవుతున్నట్టుగా టాక్ .

ఇటీవల బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్ “కింగ్” చిత్ర హిందీ థియేట్రికల్ హక్కులు సుమారు 250 కోట్ల రూపాయల రికార్డు ధరకి అమ్ముడయ్యాయి. ఆ రేంజ్ బంచ్ వరకు "రామాయణ" చిత్రానికి ఇచ్చేందుకు పంపిణీదారులు సిద్ధంగా ఉన్నప్పటికీ, 450 కోట్ల ఫిగర్ అనగానే వ్యాపార పరంగా రిస్క్ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే నిర్మాత నమిత్ మల్హోత్రా మాత్రం సినిమా పై ఉన్న నమ్మకంతో తన డిమాండ్‌పై వెనక్కి తగ్గడం లేదు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 42,000 కంటే ఎక్కువ స్క్రీన్లలో, దాదాపు 45 భాషల్లో రిలీజ్ కాబోతోందని, అందుకే అంత రేట్ అనే టాక్ కూడా ఉంది.

also read: Karuppu: ఇవేం కలెక్షన్స్ స్వామి.. ఫస్ట్ వీక్ లోనే ఆ తమిళ అగ్ర హీరో రికార్డు గల్లంతు

థియేట్రికల్ హక్కులే కాకుండా డిజిటల్ రైట్స్ విషయంలో కూడా రామాయణ సరికొత్త రికార్డులని సృష్టిస్తోంది. రెండు బాగాలకి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ చేసిన 700 కోట్ల రూపాయల భారీ డీల్‌ని కూడా నమిత్ మల్హోత్రా సున్నితంగా తిరస్కరించినట్లు ఇండస్ట్రీ టాక్. కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే ఏకంగా 1000 కోట్ల రూపాయల మార్కుని  అందుకోవడమే లక్ష్యంగా మేకర్స్ అడుగులు వేస్తున్నారని టాక్ కూడా జనరేట్ అవుతుంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం రామాయణ కేవలం ఇండియాలోనే 1000 కోట్ల నుండి 1500 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, గ్లోబల్ మార్కెట్‌లో ఈ సినిమా ఏకంగా 2500 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను లిఖిస్తుందని ట్రేడ్ పండితులు బలంగా అంచనా వేస్తున్నారు.

 స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి(Nitiesh Tiwari)తెరకెక్కిస్తున్న రామాయణలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా సాయి పల్లవి సీతాదేవి అమ్మవారిగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా, బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ హనుమంతుడిగా చేస్తున్న విషయం తెలిసిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com