ఆస్కార్ బరిలో రామాయణ స్పీడ్: టాప్ 20 లో చోటు..కాకపోతే ఆ బలమైన చిత్రాలు కూడా పోటీలో!
Nov 25, 2026 3:20PM

'రామాయణ' సాధించిన సంచలన విజయం నభూతో న భవిష్యత్. ఈ విజయాన్ని కట్టబెట్టిన భారతీయ సినీ ప్రేమికుల కళ్ళల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో రామాయణ అరుదైన ఘనతని అందుకుంది.
99వ ఆస్కార్ అవార్డుల బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో టాప్-20లో చోటు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇండియన్ సినీ అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పుడు సాధారణ సినిమాలతో కాదు.. హాలీవుడ్లో భారీ అంచనాలున్న చిత్రాలతో పోటీపడుతోంది.
క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’, ‘డ్యూన్: పార్ట్ 3’, ‘అవెంజర్స్: డూమ్స్‌డే’, ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’, ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ వంటి చిత్రాలు కూడా ఈ రేసులో ఉన్నాయి. ఇలాంటి అంతర్జాతీయ చిత్రాల సరసన మన పురాణ గాథ నిలవడం విశేషం.

గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ కూడా ఆస్కార్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో టాప్-20 వరకు వెళ్లింది. ఇప్పుడు ‘రామాయణం’ కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందడం భారతీయ సినిమాకి గర్వకారణంగా మారింది. ఈ చిత్రానికి ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ DNEG, ReDefine సంస్థలు పనిచేశాయి.
ఇది కూడా చదవండి: బయటపడ్డ మాధురి దీక్షిత్ అసలైన ఏజ్: 25 ఇయర్స్ నే అంట..ఆ బ్యూటీ సీక్రెట్ ఇదే!
అయితే టాప్-20లో చోటు దక్కించుకోవడం అంటే ఆస్కార్ నామినేషన్ ఖరారైనట్లు కాదు. తదుపరి ఓటింగ్ ప్రక్రియలో ఈ జాబితా నుంచి 10 చిత్రాలని షార్ట్‌లిస్ట్ చేస్తారు. డిసెంబర్ 15న ఆ జాబితా ప్రకటించనున్నారు. అనంతరం తుది నామినేషన్లు జనవరి 21న వెలువడనున్నాయి.
.webp)
మొత్తానికి హాలీవుడ్ దిగ్గజాల మధ్య భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ పోటీ పడుతుండటం విశేషం. మరి ఈ సినిమా చివరి వరకు ఆస్కార్ రేసులో నిలిచి భారతీయ సినిమాకు మరో అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
మీకు నచ్చవచ్చు
గరివిడి లక్ష్మి: ఐదు భాషల్లో సందడి!
ఎన్టీఆర్ కి ఉన్న టాలెంట్ ఇండియాలో మరెవరికి లేదు!
[Ramayana, Oscar, Best VFX, Ranbir Kapoor, Bollywood]




