TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఓటీటీలోకి గరివిడి లక్ష్మి: ఐదు భాషల్లో సందడి.. డేట్ తెలిస్తే ఈ రోజే పనులన్నీ ఫినిష్ చేస్తారు!

Nov 25, 2026 2:22PM


చందమామ..చందమామ..చందమామ.. అని  రెండు తెలుగు రాష్టాల సినీ ప్రేమికులు, సంగీత ప్రియులు పాడుకునేలా చేసిన చిత్రం గరివిడి లక్ష్మి. సెల్యులాయిడ్ పై మెరిసిన అద్భుత దృశ్య కావ్యం అని కూడా చెప్పుకోవచ్చు.

ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం గత నెల అక్టోబర్ 17 న విడుదలైన గౌరవప్రదమైన విజయాన్నే అందుకుంది. రిలీజ్ టైం మరొకటి ప్లాన్ చేసి ఉంటే విజయ శాతం ఎక్కువగా ఉండేదనే అభిప్రాయం సినీ విశ్లేషకుల నుంచి స్టిల్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే  ఆ టైంలో కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఇప్పుడు  ‘గరివిడి లక్ష్మి’  ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్  హక్కులని  సొంతం చేసుకోగా.. ఈ నెల 26 నుంచి అంటే రేపే  స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులకు ఇది మంచి అవకాశం.

చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొని, బుర్రకథలు, జానపద పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె జీవితంలోని సంఘటనలను ఇందులో చూపించారు. కళాకారులకు రావాల్సిన గుర్తింపు, వారి జీవితాల్లో ఎదురయ్యే సంఘర్షణలను ఈ చిత్రం చాలా సుస్పష్టంగా చెప్పింది. ప్రతిభ, అమాయకత్వం,ప్రేమ, ఆశ, మోసం, నిస్సహాయత గరివిడి లక్ష్మి జీవితంతో  ఎలా ఆడుకున్నాయో చాలా చక్కగా చూపించారు.

ఇది కూడా చదవండి: ఆ తెలుగు హీరోకి ఉన్న టాలెంట్ ఇండియాలో మరెవ్వరికీ లేదు.. తెలుగులో తోప్ అతనే!

 

 గరివిడి లక్ష్మి గా ఆనంది నటన మిమ్మల్ని నిద్రపోతున్నా వెంటాడుతూనే ఉంటుంది  .  రాశి,రాగ్ మయూర్, నరేష్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య తదితరులు కీ రోల్స్. . గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు  టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.

 

మీకు నచ్చవచ్చు

వెంకటేష్ నయా పిలుపు: ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్!

భోగి ఎల్లుండి రిలీజ్: అనుపమ పరమేశ్వరన్ కి అన్యాయం జరిగిందా!

 

[Garividi Lakshmi, Anandhi, Amazon Prime Video, Garividi Lakshmi Biopic]

google-ad-img