
భారతీయ సినీ ప్రేమికులతో పాటు, రామభక్తులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రామాయణకి కౌంట్ డౌన్ కి స్టార్ట్ అయ్యింది. ఇంకెంత మహా అయితే నెలన్న రోజులు. దీంతో రిలీజ్ డేట్ నవంబర్ 6 వడివడిగా వస్తుండటంతో మేకర్స్ కూడా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఈ క్రమంలోనే నిన్న వినాయకుడికి చవితి శుభాకాంక్షలు చెప్తూ 'జై జై రామ్' సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.
అయితే 'సియారామ్ సియారామ్' అనే హుక్ లైన్ వెంటనే క్యాచ్ అయ్యేలా ఉంది. దీంతో ఇంతటి ప్రెస్టేజియస్ట్ పాటలో ఇప్పటికే చాలా భక్తి పాటల్లో వినిపించిన 'సియారామ్' ఫీల్ ని ఎందుకు నమ్ముకున్నారని, పరిచయమైన భక్తి సాంగ్ లాగానే ఉందనే విమర్శలు వస్తున్నాయి. ప్రశ్న ని సోషల్ మీడియా వేదికగా కొంత మంది లేవనెత్తుతున్నారు. ఏది ఏమైనా అందరకీ నచ్చాల్సిన అవసరం లేదు. కానీ సాంగ్ రిలీజైన కొద్దీ సేపటి నుంచే రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.
రామాయణ నుంచి రిలీజైన తొలి సాంగ్ కూడా కావడంతో పండగ మూడ్ లో కూడా అభిమానులు,సంగీత ప్రియులు జై జై రామ్' సాంగ్ మూడ్ లో ఉండిపోయారు. రామ భక్తులైతే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ఆస్కార్ విజేతలు ఏ.ఆర్. రెహమాన్ హన్స్ జిమ్మర్ సంగీత సారథ్యంలో రూపొందిన జై జై రామ్ వింటుంటే ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రశాంతతను, మైమరిపించే భక్తి భావాన్ని అందిస్తోంది. డాక్టర్ కుమార్ విశ్వాస్ అందించిన అత్యద్భుతమైన సాహిత్యం భక్తి రసాన్ని పండించగా, భారతీయ సంగీత దిగ్గజాలు అరిజిత్ సింగ్ మరియు శ్రేయా ఘోషాల్ తమ అమృతతుల్యమైన గాత్రంతో ఈ పాటకు మరింత జీవం పోశారు.ఈ పాట కేవలం ఒక కమర్షియల్ సినిమా గీతంలా కాకుండా ఒక పవిత్రమైన ప్రార్థనలా ప్రారంభమై, శ్రోతలను నేరుగా రామరాజ్యపు ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్తుందనే అభిప్రయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
.webp)
Also Read: ఒంటిపై బట్టలు లేకుండా ఈ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా!
సాంగ్ లో విజువల్స్ పరంగా చూసుకుంటే శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి తమ క్యారెక్టర్స్ లో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటోంది. రణబీర్ కపూర్ దైవికమైన కాంతి, తేజస్సుతో మెరిసిపోతుండగా, సాయి పల్లవి సీతమ్మవారి పాత్రలో చూపించిన పవిత్రత మరియు సాత్వికమైన వ్యక్తీకరణలు ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విఎఫ్ఎక్స్ (VFX), సిజిఐ (CGI) హంగుల కంటే కూడా భావోద్వేగాలకే ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు నితిన్ తివారి ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో భక్తి శ్రద్ధల తో రూపొందించినట్లు స్పష్టమవుతోంది. ప్రపంచ సినీ ప్రేమికులని రామాయణ థియేటర్స్ కి తీసుకురావడమే లక్ష్యంగా రామాయణని నమిత్ మల్హోత్రా నిర్మించాడు.
[Ramayana,Jai Jai Ram Song Review, Ranbir Kapoor, Sai Pallavi, Namith Malhotra,Nitesh Tiwari, Telugu Cinema, Telugu Cinema News, Tollywood Cinema News, Tollywood]






