Home

»

Latest News

ది ప్యారడైజ్ కోసం 2000 లీటర్ల రక్తం: ఆ రక్తం ఎవరిదో తెలుసా!

Sep 12, 2026 3:01PM

 

నాచురల్ స్టార్ నాని వన్ మాన్ షో 'ది ప్యారడైజ్' (రిలీజ్ డేట్  24 ) కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.  దీంతో ప్రమోషన్స్ జోరందుకోవడం, నాని నే నిన్నటినుంచి స్వయంగా పాల్గొనడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అందరకి  ప్యారడైజ్ ఆవహించిందని చెప్పవచ్చు . అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించి ఓవర్ సీస్ లో సరికొత్త రికార్డ్స్ కూడా సృష్టిస్తుంది. 

ఈ చిత్రానికి స్టార్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్షణ్ యాక్షన్ సీక్వెన్స్ చేశారు. ఆ ఇద్దరు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 'సాధారణంగా ఏ వైలెంట్ సినిమాలోనైనా కొన్ని లీటర్ల రక్తాన్ని మాత్రమే ప్రాప్‌గా ఉపయోగిస్తుంటారు. కానీ ‘ది ప్యారడైజ్’ ప్రపంచం అంత రస్టెడ్, రా, వైలెంట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుండటంతో ప్రతి సన్నివేశం రక్తం చిందించేలా ప్లాన్ చేసాం. యాక్షన్ సీక్వెన్సెస్ కోసమే ఏకంగా 2000 లీటర్లకు పైగా ప్రాప్ బ్లడ్ ఉపయోగించాల్సి వచ్చింది. ఇది టాలీవుడ్ చిత్రసీమ చరిత్రలోనే అత్యధిక రక్తపాతం కలిగిన మాస్ సీన్లలో ఒకటిగా నిలవబోతోంది. నాని ఇప్పటివరకు తన కెరీర్‌లో చేయని సరికొత్త గెటప్ మరియు వైలెంట్ అవతార్‌లో  కనిపించబోతున్నారు.

 

 

 

 

Also Read: సుద్దాల అశోక్ తేజకి ప్రతిష్టాత్మక పురస్కారం: మూడవ తెలుగు వాడిగా రికార్డు 

సినిమా కథనం 100 శాతం ఎమోషనల్ అండ్ రా కాన్సెప్ట్‌తో నడుస్తుందని, అందుకే ఈ రకమైన రక్తపాతం కేవలం సన్నివేశాల గాఢతని పెంచడానికే తప్ప ఊరికే చూపించడానికి కాదని చెబుతున్నారు.ఇక ఈ వైలెంట్ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా పదుల సంఖ్యలో వర్కింగ్ డేస్ కేటాయించి, సుమారు 500 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు మరియు హెవీ ఫైటర్లతో భారీ షెడ్యూల్స్ నిర్వహించారు. నాని స్వయంగా డ్యూప్ లేకుండా అనేక ప్రమాదకరమైన ఫైట్స్ చేసి తన డెడికేషన్‌  చాటుకున్నాడు. ఏది ఏమైనా నాని ప్యారడైజ్ ఫ్లేవర్ స్టార్ట్  అయ్యింది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్. 

 

 

 

[Nani,  The Paradise, Ram Lakshman Stunts, Srikanth Odhela, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com