Home

»

Latest News

‘పెద్ది’ ఎఫెక్ట్: చరణ్ కాదు.. ఇకపై ‘చరణ్ జీవి’.. బుచ్చిబాబు షాకింగ్ కామెంట్స్!

Jun 13, 2026 7:11PM

 

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వ‌చ్చిన పెద్ది భారీ ఓపెనింగ్స్ సాధించ‌డ‌మే కాకుండా క‌లెక్ష‌న్ల‌ప‌రంగా దూసుకుపోతోంది. ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవితో దర్శ‌కుడు బుచ్చిబాబు సినిమాకి వస్తున్న రెస్పాన్స్ గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ గురించి బుచ్చిబాబు చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  

ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ఒక సరికొత్త స్థాయిలో ఉంద‌ని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా చూసిన అభిమానులు, సినీ విశ్లేషకులు ఇప్పుడు రామ్ చరణ్‌ను ‘చరణ్’ అని పిలవడం లేదని, ఆయనను ఏకంగా "చరణ్ జీవి" అని సంబోధిస్తున్నారని బుచ్చిబాబు వెల్లడించారు.

ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు అర్థాన్ని వివరిస్తూ.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఆరంభంలో ‘ఖైదీ’, ‘స్వయంకృషి’, ‘రుద్రవీణ’ వంటి సినిమాల్లో చూపించిన నటన, ఇంటెన్సిటీ గుర్తున్నాయా? సరిగ్గా అలాంటి వింటేజ్ వైబ్స్ మరియు ఎమోషన్స్ ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ పలికించారని బుచ్చిబాబు అన్నారు. 

చరణ్‌లోని ఆ అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి గారి యంగ్ డేస్ గుర్తుకు వస్తున్నాయని, అందుకే అభిమానులు ఆయనను ప్రేమతో ‘చరణ్ జీవి’ అని పిలుచుకుంటున్నారని తెలిపారు. ఈ ఒక్క మాటతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు.బుచ్చిబాబు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వడమే ఆలస్యం.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో #PEDDI, #CharanJeevi అనే హ్యాష్ ట్యాగ్‌లు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com