
- డైరెక్టర్ బుచ్చిబాబు మామూలోడు కాదు
- 'పెద్ది' సినిమా కోసం 'పెద్ద' స్కెచ్
- 5 నిమిషాల సీన్ కోసం ఏకంగా 3 నెలల టైం!
- వరల్డ్ క్లాస్ క్వాలిటీతో గ్లోబల్ స్టార్ మూవీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'(Peddi)పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక పవర్‌ఫుల్ మల్ల యోధుడి పాత్రలో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే, తాజాగా ఈ సినిమాలోని ఒక అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
5 నిమిషాల మ్యాజిక్.. 3 నెలల హార్డ్ వర్క్!
ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత కీలకం కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం, కేవలం నాలుగు నుండి ఐదు నిమిషాల నిడివి ఉండే ఒక కుస్తీ ఫైట్ సీక్వెన్స్ ను పూర్తి చేయడానికి చిత్ర బృందానికి దాదాపు మూడు నెలల సమయం పట్టిందట. ఒక చిన్న సీక్వెన్స్ కోసం ఇంత సమయం, శ్రమను కేటాయించారంటే.. 'పెద్ది' అవుట్‌పుట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మనం ఊహించుకోవచ్చు.
వరల్డ్ క్లాస్ క్వాలిటీ!
'పెద్ది' పాత్ర కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని, ఒక ప్రొఫెషనల్ రెజ్లర్ బాడీని బిల్డ్ చేశారు. ఆయన పహిల్వాన్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేసింది. కేవలం శారీరక శ్రమ మాత్రమే కాకుండా, టెక్నికల్ గా కూడా ఈ సినిమాను వరల్డ్ క్లాస్ క్వాలిటీతో రూపొందిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాని ఏమాత్రం రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఫ్రేమ్‌ను చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దుతుండటమే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.
'పెద్ది' సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ అనుభూతిని ఇవ్వనున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా, జూన్ నెలలో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.






