Home

»

Latest News

Ntr: ఫ్యాన్స్ ని ఉర్రుతలూగించే బిగ్ న్యూస్

Apr 21, 2026

 


-రాబోయే రోజులన్నీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వే
-కీలక అప్డేట్ వచ్చేసింది
-మరి లేటు చెయ్యకుండా ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం


మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న న్యూస్ రానే వచ్చింది. సదరు న్యూస్ ని  పదే పదే చూసుకొని మురిసిపోని అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. ఆ న్యూస్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఆఫ్ కోర్స్ మూవీ లవర్స్ కి కూడా వెరీ బిగ్గెస్ట్ న్యూస్. మరి ఆ వార్త ఏంటో చూసేద్దాం.


ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్(Prashanth Neel)కాంబోలో యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆ ఇద్దరి గత చిత్రాల్లో ఉన్న యాక్షన్  స్థాయిని మించి హై వోల్టేజ్ యాక్షన్ గా తెరకెక్కబోతుంది. కాసేపటి క్రితం ఈ చిత్రం రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2027 జూన్ 11 రిలీజ్ డేట్.  ఇప్పుడు ఈ డేట్ నిమిషాల్లోనే మాములు రెగ్యులర్ డేట్ నుంచి విస్ఫోటనం సృష్టించే రోజుగా స్థానాన్ని సంపాదించుకుంది. 

also read: Allu Arjun: అల్లుఅర్జున్ మూవీలో అవకాశం కోసం ఆ ఇంజెక్షన్ తీసుకున్న హీరోయిన్!

ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న  'ఫస్ట్ గ్లింప్స్'  రిలీజ్ కానుంది.  ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్‌తో ఎన్టీఆర్ ని  ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడో అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి డ్రాగన్(Dragon)అనే టైటిల్ ప్రచారంలో ఉండగా గ్లింప్స్‌  రిలీజ్ రోజు అధికారకంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కి జోడిగా రుక్మిణి వసంత్ జత కడుతుండగా  బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ముఖ్యమైన క్యారక్టర్ లో కనిపించనున్నాడు. రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లోనే హై బడ్జెట్ మూవీ.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com