
థియేటర్స్ రజినీ మ్యానియాతో ఊగిపోవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇంకెంత మహా అయితే కొన్ని గంటల్లో ప్రీమియర్స్ ప్రదర్శించడంతో ఫ్యాన్స్ లో కోలాహాలం కూడా స్టార్ట్ అయ్యింది. అలాంటి ఈ టైంలో ఫస్ట్ రివ్యూ ఇదే అంటూ సోషల్ మీడియాలో, ట్రేడ్ సర్కిల్స్ లో న్యూస్ చెలామణి అవుతుంటే, అది కూడా పాజిటివ్ గా ఉంటే ఇంకేమైనా ఉందా!
టాక్ ప్రకారం, 'జైలర్ 2' చిత్రం అభిమానులకి, మాస్ ప్రేక్షకులకి ఒక పరిపూర్ణమైన విందులా ఉండబోతోంది. రజినీకాంత్ మార్క్ మ్యానరిజమ్స్, నెల్సన్ మార్క్ డార్క్ కామిడీ, అనిరుధ్ రవిచందర్ రికార్డు స్థాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలంగా నిలవబోతున్నాయంట. ముఖ్యంగా సెకండాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ నాన్స్టాప్ ర్యాంపేజ్లా ఉంటాయని, థియేటర్లలో ఈలలు, కేకలతో ఫ్యాన్స్, ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోవడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బ్లాక్ అభిమానులకి గూస్బంప్స్ తెప్పించేలా డిజైన్ చేశారట. టోటల్ గా చెప్పాలంటే జైలర్ ని మించి ఉండబోతుందనేది టాక్.
ఇది కూడా చదవండి: 'రాజాసాబ్' ఫెయిల్యూర్ తర్వాత.. రూటు మార్చిన డైరెక్టర్ మారుతి..కొత్త మూవీ సబ్జెక్టు ఇదే!

ఇక రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 50 కోట్లకి పైగా ప్రీ సేల్స్ సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఓవర్సీస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ 11 కోట్లు దాటడం రజినీ కట్ అవుట్ కెపాసిటీని తెలియచేస్తుంది.
[Jailer 2 First Review, Jailer 2 Review, Rajinikanth Jailer 2 Review, Jailer 2 advance booking, Jailer 2 inside talk, Nelson Dilipkumar, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






