Home

»

Latest News

వామ్మో తెలుగు థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా: అసలు ఆ బిజినెస్ నిజమేనా! 

Sep 9, 2026 12:49PM

 

 

మహేష్, రాజమౌళి  'వారణాసి' గురించి డైలీ మాట్లాడుకోవడం అభిమానులు, మూవీ లవర్స్ కే కాదు భారతీయ సినిమాకే గర్వకారణం అని చెప్పుకోవచ్చు. వరల్డ్ సినిమా టార్గెట్ గా కూడా తెరకెక్కుతున్న వారణాసికి సంబంధించిన బిజినెస్ న్యూస్ ఇప్పుడు  హీట్ ని రాజేస్తోంది. 


తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 350 కోట్లకి ఫైనల్ అయ్యాయనే ప్రచారం జరుగుతుంది. మరి ఇదే నిజమైతే బిజినెస్ పరంగా 'వారణాసి' చరిత్ర సృష్టించినట్టే    . రాజమౌళి ప్రీవియస్ మూవీ 'ఆర్ఆర్ఆర్'  తెలుగు స్టేట్స్ లో 200 కోట్లు బిజినెస్ జరుపుకోగా 270 కోట్ల షేర్ వసూలు చేసింది. బాహుబలి 2’ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 122 కోట్ల థియేట్రికల్ బిజినెస్ సాధించగా ఇప్పుడు వారణాసి చిత్రం రూ. 320 కోట్ల నుండి రూ. 350 కోట్ల రేంజ్‌లో బిజినెస్ ఆఫర్లు అందుకోవడం టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా మారుతోంది.

 

 

Also Read: టాలీవుడ్ లో సొంత ఇల్లు లేని స్టార్ హీరోలు వీళ్ళే

ఒక ప్రాంతీయ భాషా చిత్రానికి కేవలం హోమ్ మార్కెట్ నుంచే ఈ స్థాయి డిమాండ్ రావడం భారతీయ సినీ చరిత్రలోనే అపూర్వం.  కె.ఎల్. నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ విజువల్ వండర్‌లో మహేష్ బాబు 'రుద్ర' మరియు 'శ్రీరాముడు' వంటి రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

 

 

[Varanasi, Mahesh Babu, Rajamouli, Priyanka Chopra, Telugu Rights, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com